ETV Bharat / politics

చంద్రబాబు, లోకేశ్​ను కలుస్తున్న ఆశావహులు - భవిష్యత్తు చూసుకుంటానంటూ భరోసా - Unhappy leaders in TDP

TDP Aspirants meet Chandrababu and Nara Lokesh: టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని నేతలు చంద్రబాబును, నారా లోకేశ్​ను ఉండవల్లిలోని వారి నివాసంలో కలుస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ చంద్రబాబుని ఆయన నివాసంలో కలిసి గుంటూరు పార్లమెంట్ స్థానం ఇవ్వాలని కోరారు. శ్రీకాళహస్తి, సత్యవేడు తెలుగుదేశం కార్యకర్తలు నారా లోకేశ్​ను కలిసేందుకు వచ్చారు.

tdp_aspirants_meet_cbn
tdp_aspirants_meet_cbn
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 2:09 PM IST

TDP Aspirants meet Chandrababu and Nara Lokesh: తెలుగుదేశం ఆశావహులు, తొలి జాబితాలో (TDP MLA Candidates List) చోటు దక్కని నాయకులు పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్​ను కలుస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ స్థానం ఆశిస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ (Pemmasani Chandrasekhar) చంద్రబాబుని ఆయన నివాసంలో కలిశారు. తనకు లోక్‌సభ టికెట్ ఇవ్వాలని కోరారు. ఇక నారా‌ లోకేశ్​ను కలిసేందుకు శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు వచ్చారు.

ఉత్కంఠ రేపుతోన్న గుంటూరు రాజకీయాలు- అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు

తొలి జాబితా ప్రకటించిన తర్వాత సీట్లు దక్కని నేతలు, మిత్రపక్షానికి సీట్లు కేటాయించిన స్థానాలకు చెందిన నాయకులు మూణ్నాలుగు రోజులుగా చంద్రబాబుతో సమావేశమవుతున్నారు. వారందరికీ సర్ది చెబుతున్న చంద్రబాబు సర్వేలు, సామాజిక సమీకరణాలు, పొత్తుల కారణంగా ఏర్పడిన పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక మీ భవిష్యత్తును చూసుకుంటానంటూ భరోసా ఇస్తున్నారు.

ఘాటెక్కిన గుంటూరు రాజకీయాలు - చంద్రబాబు నిర్ణయం కోసం ఆశావహుల ఎదురుచూపులు

YCP MLA Kolusu Parthasaradhi Join in TDP: అధికార పార్టీకి వైసీపీ నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు. ఎన్నికల రోజుకి ఆ పార్టీలో ఎంతమంది ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి (Penamalur MLA Kolusu Parthasaradhi). విజయవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం (YCP leaders joining TDP) పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ముగ్గురు నేతలకు లోకేశ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలంటే అది కేవలం చంద్రబాబుతోనే అవుతుందని అన్నారు. చంద్రబాబును నమ్మి తాము టీడీపీ చేరుతున్నట్లు పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం జరగబోయే ఎన్నికల్లో ప్రజలంతా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

టీడీపీ, జనసేన నేతలతో లావు శ్రీకృష్ణదేవరాయలు వరుస భేటీలు - ఆ సీటు ఆయనకేనా?

ఎంపీగా పోటీ చేయనున్న లావు: నరసరావుపేట సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఎంపీగా పోటీ చేయడం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.