ETV Bharat / politics

వైఎస్సార్సీపీ అండతో రూ.4 కోట్ల విలువైన భూమి కబ్జా - లోకేశ్​కు బాధితుడి మొర - nara lokesh prajadarbar - NARA LOKESH PRAJADARBAR

Nara Lokesh Prajadarbar : రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీ ఎత్తున మంగళగిరికి తరలి వస్తున్నారు. లోకేశ్​ను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు.

nara_lokesh_prajadarbar
nara_lokesh_prajadarbar (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 1:05 PM IST

Nara Lokesh Prajadarbar : కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నారా లోకేశ్ నివాసానికి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే యువనేతను నేరుగా కలిసి సమస్యలు విన్నవించేందుకు బారులు తీరారు. విశాఖ జిల్లా గాజువాక మండలం దువ్వాడలో రూ. 4 కోట్ల విలువైన తమ 84 సెంట్ల భూమిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ అండతో దేవెళ్ల వెంకటరమణ, రావి సత్యనారాయణ కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని గాజువాక మండలం డ్రైవర్ కాలనీకి చెందిన చూచుకొండ శ్రీనివాసరావు, జాగరపు తాతారావు లోకేశ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రి గుడివాడ అమర్​నాథ్, సీఐ బి. శ్రీనివాసరావు అండతో ఫోర్జరీ డ్యాక్యుమెంట్లు సృష్టించి సదరు భూమిని అక్రమించారని యువనేత ఎదుట చూచుకొండ శ్రీనివాసరావు, జాగరపు తాతారావు వాపోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరేళ్ల నుంచి గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నానని, 24 గంటలూ ఆక్సిజన్ సిలిండర్ పైనే ఆధారపడి బతుకుతున్నానని చూచుకొండ శ్రీనివాసరావు యువనేత ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. విద్యుత్ షాక్ తో రెండు చేతులు కోల్పోయిన తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంకు చెందిన తాటిబోయిన రవీంద్ర నారా లోకేశ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు.

ఈ రాష్ట్రం నీ తాత జాగీరా జగన్‌- ధనదాహానికి అంతు లేదా?: లోకేశ్ - Nara Lokesh on YSRCP Offices

కరెంట్ బిల్లు సాకుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిన వితంతు పెన్షన్ పునరుద్ధరించాలని తాడేపల్లి మండలం పోలకంపాడు గ్రామానికి చెందిన అనవాయమ్మ, హైమావతి కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె వైద్యానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడికి చెందిన బిరుదు కమలాకరరావు కోరారు. ప్రతి ఒక్కరి సమస్యను విన్న యువనేత, ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

అధైర్యపడొద్దు, అండగా ఉంటా - 'ప్రజాదర్బార్‌'లో మంత్రి లోకేశ్​ భరోసా - Nara Lokesh Praja Darbar

టెట్‌లో అర్హత సాధించని వారికి నారా లోకేశ్ శుభవార్త- మరోసారి పరీక్ష ఉంటుందని ప్రకటన - nara lokesh on ap tet results

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.