CM Jagan Reddy is Woman Traitor : సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు నిలదీశారు. విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ హాని జరిగినా దానికి జగన్‌దే బాధ్యత అని అన్నారు. సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. జగన్ రెడ్డి పాపం పండిందని యనమల ధ్వజమెత్తారు.
అధికారం కోసం ఆయన చేసిన పాపాలే నేడు శాపాలుగా మారాయని విమర్శించారు. జగన్ రెడ్డి 420 అని వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆయన నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయన్నారు. పులివెందులలో సొంత చెల్లెలు సునీతారెడ్డి సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం మహిళలను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. సొంత కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా ఉద్ధరిస్తారని మండిపడ్డారు. మహిళా సాధికారత టీడీపీ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు మహిళలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు కల్పించారని యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు.
తల్లిలాంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు - ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి : షర్మిల
యనమనల లేఖ పూర్తి సారాంశం ఇది.. 'జగన్‌రెడ్డి పాపం పండింది. అధికారం కోసం ఆయన చేసిన పాపాలే నేడు శాపాలుగా మారి జగన్ మెడకు చుట్టుకుంటున్నాయి. రక్తం పంచుకొని పుట్టిన చెల్లెళ్లే జగన్ రెడ్డి నేరాలు, ఘోరాల గురించి చెబుతున్నారు. ఆయన సీఎంగా అనర్హుడు అని వాళ్లే అంటున్నారు. జగన్ రెడ్డి 420 (Jaganreddy 420) అని షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆయన నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. వంచన, నమ్మకద్రోహంతో మహిళా ద్రోహిగా జగన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఆయన వ్యవహరిస్తున్న తీరుతో మహిళా లోకం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్ రెడ్డి లాంటి క్రూర మనస్తత్వం కలిగిన నాయకుడు ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగలేరు. ఆయన వ్యవహార శైలిపై తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెబుతోంది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఆయన విపరీత ధోరణితో తలవంపులు తెచ్చిన మాట నిజం.
పథకాలకు జగనన్న పేరు - 6 వేల కోట్లు నిలిపివేసిన కేంద్రం: యనమల
పులివెందుల (Pulivendula)లో సొంత చెల్లెలు సునీతారెడ్డి సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం మహిళలను అవమానించడం కాదా ? సొంత కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా ఉద్ధరిస్తారు? సునీతారెడ్డి (sunitha Reddy), వైఎస్ షర్మిల అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా? ఎందుకు నోరు మెదపడం లేదు ? అన్నకి ఓటు వేయొద్దని సొంత చెల్లెలే చెప్పిందంటే అర్థం ఏంటి? విలవలు, విశ్వసనీయత అంటూ పదే పదే మాట్లాడే జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు ? సొంత బాబాయిని దారుణంగా చంపిన హంతకులకు వంతపాడి న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్లపై విష ప్రచారం చేయటమే మీ విశ్వసనీయతా ? సొంత చెల్లి పుట్టుక మీద కూడా తప్పుడు ప్రచారం చేయిస్తున్న నీలాంటి అన్న బహుశా ఏ చెల్లికి ఉండకూడదేమో ? సొంత చెల్లెళ్లకే న్యాయం చేయలేని వాడివి మహిళలకు ఏం చేస్తావని సగటు నారీమణి ప్రశ్నిస్తోంది జగన్‌రెడ్డి (jagan reedy) దమ్ముటే సమాధానం చెప్పు' అని నిలదీశారు.
వచ్చే ఏడాదికి ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటిపోతుంది: యనమల రామకృష్ణుడు
మహిళా సాధికారత కోసం టీడీపీ కట్టుబడి ఉన్నదని యనమల పేర్కొన్నారు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించారని వెల్లడించారు. మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజికాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి చర్యలతో మహిళల భద్రత (Women Safety) గాలిలో దీపమైంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓట్ల కోసం జగనన్న హామీలిస్తాడు - అమలు మాత్రం చేయడు: వైఎస్ షర్మిల