K Keshava Rao Joins Congress Party : కాంగ్రెస్‌లో చేరికలపర్వం కొనసాగుతోంది. కారు దిగుతున్న పలువురు నేతలు హస్తం గూటికి ఒక్కరొక్కరుగా చేరుతున్నారు. ఈక్రమంలోనే సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలోని సీఎం రేవంత్ సమక్షంలో కండువా కప్పి ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే పార్టీలోకి కేకేను ఆహ్వానించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే కుమార్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.