ETV Bharat / politics

కార్యకర్తలు వద్దంటున్నారు - నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం లేదు : ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ - BRS MLA Prakash Goud - BRS MLA PRAKASH GOUD

MLA Prakash Goud on Party Change : తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరబోనని, పార్టీ మారడం లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం పార్టీ నియోజకవర్గ నేతలు, అనుచరులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

BRS MLA PRAKASH GOUD ON CONG JOIN
MLA Prakash Goud on Party Change
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 7:57 PM IST

MLA Prakash Goud on Party Change : గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు షికార్లు కొట్టాయి. నిన్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ప్రకాశ్‌ గౌడ్‌ సీఎంతో సమావేశమయ్యారు.

కడియంను రాజకీయంగా భూ స్థాపితం చేయడమే లక్ష్యం : బీఆర్ఎస్ నేత రాజయ్య - BRS Rajaiah Fires On Kadiyam

పార్టీ మార్పుపై బీఆర్ఎస్​ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్ స్పష్టతనిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరడంలేదని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం పార్టీ నియోజకవర్గ నేతలు, అనుచరులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మార్పువల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని నియోజకవర్గ నేతలు, అనుచరులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈనేపథ్యంలో పార్టీ మార్పుపై వెనకడుగు వేసినట్లు ప్రకాశ్​గౌడ్ తెలిపారు. తనకు బీఆర్​ఎస్ పార్టీ మంచి గౌరవం ఇచ్చినట్లు తెలిపారు.

"నేను పార్టీ మారడం లేదు. బీఆర్ఎస్​లోనే కొనసాగుతాను. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ నేతలు, అనుచరులతో సమావేశం నిర్వహించాను. పార్టీ మారడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని నేతలు నా దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్​ రెడ్డితో చర్చించాను. పార్టీ మార్పు నిర్ణయంపై వెనకడుగు వేస్తున్నాను". - ప్రకాశ్​ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే.

నేను కాంగ్రెస్ పార్టీలోకి చేరడం లేదు - ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్

ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారు. ఇంకా చాలా మంది బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని హస్తం నేతలు అంటున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీలు సైతం కాంగ్రెస్​, బీజేపీలోకి చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మారిన నేతలకు కాంగ్రెస్, బీజేపీలు ఎంపీ టికెట్లు కేటాయించాయి. ఒకప్పడు బీఆర్ఎస్​ నుంచి పోటీచేసిన నేతలందరూ, ఇప్పుడు బీఆర్ఎస్​కే ప్రధాన పోటీదారులుగా బరిలోకి దిగారు.

ఏప్రిల్ 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర - మిర్యాలగూడలో ప్రారంభం - KCR BUS YATRA SCHEDULE

బీఆర్ఎస్​కు మరో షాక్ - పార్టీకి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి రాజీనామా - Bheti Subhash Reddy resigns BRS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.