ETV Bharat / politics

రేపు తెలంగాణలో రాహుల్​ గాంధీ పర్యటన - ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ - Rahul Gandhi Telangana Tour 2024 - RAHUL GANDHI TELANGANA TOUR 2024

Rahul Gandhi Telangana Tour Schedule : లోక్​సభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేసేందుకు హస్తం పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ తెలంగాణకు రానున్నారు. నిర్మల్​, జోగులాంబ గద్వాల్​ జిల్లాలలో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. రైతు రుణమాఫీ, గ్యారంటీల అమలు గురించి మాట్లాడనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్​ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Rahul Gandhi Public Meeting in Nirmal
Rahul Gandhi Telangana Tour (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 4:27 PM IST

Rahul Gandhi Telangana Tour Schedule : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ఓటర్ల దృష్టిని ఆకర్శించేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్​ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండటంతో ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి. ప్రచారానికి అగ్రనేతలు రానుండటంతో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్​ షా వచ్చి తమ పార్టీల తరుఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్​ పార్టీ తరుఫున ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి జనజాతర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్​ గాంధీ మే 5న తెలంగాణకు రానున్నారు. నిర్మల్​లోను, జోగులాంబ గద్వాల్​ జిల్లాలోని అలంపూర్​లో జరిగే బహిరంగ సమావేశాలకు హాజరవ్వనున్నారు.

Rahul Gandhi Nirmal Meeting Arrangements : ఆదిలాబాద్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ సైతం ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ సభల్లో పాల్గొని ఎన్నికల శంఖారావం పూరించగా తాజాగా ఆదివారం నిర్మల్​లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అయిదు గ్యారెంటీ పథకాలు, వచ్చే ఆగస్టు పంధ్రాగస్టు నాటికి రూ.2 లక్షల రైతు రుణమాఫీ, ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి తొలిసారిగా మహిళా అభ్యర్థిగా ఆత్రం సుగుణకు టికెట్‌ ఇచ్చిన అంశాలను ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తోంది.

రాయ్​బరేలీ నుంచి బరిలో రాహుల్ గాంధీ- మరి అమేఠీ నుంచి ఎవరంటే? - Lok Sabha Elections 2024

Congress Public Meetings : నిర్మల్​లో జరిగిన సమావేశం తరవాత అదే రోజు సాయంత్రం 4 గంటలకు జోగులాంబ గద్వాల్​ జిల్లాలోని ఎర్రవల్లి మండల కేంద్రంలో చేపట్టే భారీ బహిరంగ సభలో రాహుల్​ గాంధీ పాల్గొననున్నారు. ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్​ కూడా హాజరవ్వనున్నారు. దీంతో ఆయా జిల్లాలో సభ ఏర్పాట్లను పార్టీ శ్రేణలు ముమ్మరం చేశారు. సభా ప్రాంగణంలో వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీవ్రతకు తట్టుకునేలా తాగునీటి సదుపాయాలు, ట్రాఫిక్​ నియంత్రణ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సభలకు పెద్ద సంఖ్యలో రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రధాని మోదీ భయపడుతున్నారు- ఆయన కన్నీళ్లు పెట్టడం పక్కా!: రాహుల్ గాంధీ - Lok Sabha Elections 2024

ఈసారి బీజేపీకి 150 సీట్లే- మోదీ గురించి దేశమంతా తెలుసు: రాహుల్ - Rahul Gandhi on BJP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.