Purandeswari on TDP Janasena BJP Alliance: తెలుగుదేశం - జనసేనతో పొత్తు ఖరారు కావడం సంతోషకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో దుష్ట శిక్షణ - శిష్ట రక్షణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం శ్రీరామునికి కూడా ఆంజనేయుడు, జాంబవంతుడు, విభీషణుడు చివరికి ఉడత సాయం కూడా తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హితం కోసం అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలుగా కట్టుబడి ఉంటామన్నారు.
ఏపీలో కూటమి ప్రభంజనం ఖాయం - ఎన్నికలు ఏకపక్షమే: చంద్రబాబు
విజయవాడలో బీజేపీ మేనిఫెస్టో రథాలను పురందేశ్వరి ప్రారంభించారు. 9 జిల్లాల్లో ఈ వాహనాల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని వెల్లడించారు. మేనిఫెస్టో తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే వారి ముందుకు బీజేపీ ప్రచార రథాలను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ రథాల్లో రెండు బాక్సులు ఉంటాయని, ఒకటి కేంద్రం నుంచి ఏం ఆశిస్తున్నారు? మరొకటి రాష్ట్రం నుంచి ఏం కావాలనే విషయాలను బాక్సుల్లో లేఖలు రాసి వేయాలని కోరారు.
టీడీపీ,జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచింది- ఏపీ ప్రజల కోసం పనిచేస్తామన్న బీజేపీ
ఈ అభిప్రాయాలు జాతీయ స్థాయిలోనూ, అలాగే రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టో రూపకల్పనలోనూ ఉపయోగపడతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల కుటుంబాల నుంచి అభిప్రాయాలను స్వీకరించాలనేది బీజేపీ లక్ష్యంగా ఉందన్నారు. పదేళ్లుగా ప్రధాని మోదీ చేసిన సేవ ఎనలేనిదని, వచ్చే ఐదేళ్లలో ఏం చెయ్యబోతున్నామనేది ప్రచార రథాల ద్వారా వివరిస్తామన్నారు. బీజేపీ మూల సిద్ధాంతం అట్టడుగు వర్గాల సంక్షేమమేనని తెలిపారు. సీట్ల వివరాలపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు.
ప్రత్యర్థులూ ఆయన్ను గౌరవిస్తారు- బాబు విజనరీ లీడర్ : అర్నాబ్ గోస్వామి
"పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం-జనసేనతో పొత్తు ఖరారు కావడం సంతోషకరం. దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ కోసం పొత్తు అనివార్యం. ఈ నేపథ్యంలో రాష్ట్ర హితం కోసం అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలుగా కట్టుబడి ఉంటాం. మేనిఫెస్టో తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు వారి ముందుకు బీజేపీ ప్రచార రథాలను పంపిస్తున్నాం. 9 జిల్లాల్లో ఈ వాహనాల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి మేనిఫెస్టో రూపకల్పన చేస్తాం. ఒకట్రెండు రోజుల్లో సీట్ల వివరాలపై స్పష్టతనిస్తాం." - పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు