ETV Bharat / politics

మంచి, చెడుల మిశ్రమం - పాడి పంటలకు అనుకూలం - ఈ క్రోధి నామ సంవత్సరం - Ugadi celebrations in Telangana - UGADI CELEBRATIONS IN TELANGANA

Political Leaders Ugadi Celebrations : రాష్ట్రవ్యాప్తంగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణాలతో తెలుగువారు సంప్రదాయబద్దంగా పండుగను జరుపుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు నిర్వహించారు. నూతన సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందుతాయని పంచాంగ పఠనంలో పంతుళ్లు చెప్పారు. మంచి, చెడులు మిశ్రమంగా ఉన్నాయని, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

Telangana Political Leaders Ugadi Celebrations
Political Leaders Ugadi Celebrations
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 9:03 PM IST

మంచి, చెడుల మిశ్రమం పాడి పంటలకు అనుకూలం క్రోధి నామ సంవత్సరం

Political Leaders Ugadi Celebrations : క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో దేవాదాయ, భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్‌ శాంతికుమారి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ సహా పలువురు హాజరైన ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. శ్రీ క్రోది నామ సంవత్సరం అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమాజంలో మంచి చెడులు వుంటాయని, కోపతాపాలకు తావివ్వకుండా సంయమనంతో వ్యవహరించాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు.

క్రోధి నామ సంవత్సరంలో తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి: కిషన్‌రెడ్డి - Ugadi Celebrations at BJP Office

Ugadhi Celebrations in Gandhi Bhavan : హైదరాబాద్‌ గాంధీభవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాంగ పఠనం చేసిన చిలుకూరి శ్రీనివాస మూర్తి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగడం శుభపరిణామని పేర్కొన్నారు. క్రోధి నామసంవత్సరంలో సీఎం వేగంగా పనిచేస్తారని, రాహుల్‌ గాంధీ నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తాయని తెలిపారు. పొరుగు దేశాలతో వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నా మనదే పైచేయి అవుతుందని వివరించారు.

జోరుగా ఉగాది సంబురాలు - ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎడ్ల బండ్ల పోటీలు - Bullock Cart Race

BRS Leaders Ugadi Celebrations : బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కేటీఆర్‌ సహా ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. క్రోధి నామసంవత్సరంలో మంచి, చెడులు మిశ్రమంగా కనిపిస్తున్నాయని వర్షాలు సమృద్దిగా కురిసి పాడిపంటలు చక్కగా పండుతాయని పంతులు ప్రణీత్‌కుమార్‌ తెలిపారు. పాలక పక్షానికి కొంత కష్టసాధ్యంగా కనిపిస్తోందని ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. కర్కాటక రాశికి చెందిన కేసీఆర్‌ ఎత్తుగడలు విజయవంతమవుతాయన్న పంచాంగ కర్త ఆరోగ్య పరంగా ఇబ్బందులు, ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలని సూచించారు. మకరరాశికి చెందిన కేటీఆర్‌ ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయని, ఈ ఏడాది మంచి ప్రభావం కనిపిస్తోందని చెప్పారు.

BJP Kishan Reddy Couple Participated In Ugadi Celebrations : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో భాగంగా నిర్వహించిన సుదర్శన హోమంలో కిషన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పంచాగం ప్రకారం మరోసారి కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వస్తుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. సమాజంలో కొనుగోలు శక్తి పెరుగుతుందని, వర్తమానం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని పంచాంగ కర్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి వెల్లడించారు. కొత్త వ్యాధులు తలెత్తవని. ధరలు నిలకడగా ఉంటాయని తెలిపారు.

'కేసీఆర్ ఎత్తుగడలకు ప్రజామోదం లభిస్తుంది - ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి' - BRS Party Ugadi Celebrations 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.