YS Jagan Meet Pinnelli at Nellore Jail : ఒకరేమో రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరోకరం మాత్రం నేరస్తులకు వంతపాడుతున్నారు. ఒకేరోజు ఏపీకి సంబంధించిన రెండు సంఘటనలపై నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. దిల్లీలో ఏపీకి సంబంధించిన నిధులను రాబట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ కూడా ఇవాళ ఓ వ్యక్తిని కలవనున్నారు. మరి ఇంతకీ ఆయన కలిసేది ఎవరినో తెలుసా? మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.
మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. ఆయన అరాచకాలు అధికారులు కూడా వంతపాడేవారు. ఈ క్రమంలోనే తన అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ నెం.202లో ఆయన హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను నేలకేసి కొట్టారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌పైనా దాడి చేశారు.
Pinnelli Ramakrishna Reddy in Nellore Central Jail : అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల మరో మహిళపైనా దాడికి యత్నించారు. పోలింగ్ తర్వాత రోజు సైతం అనుచరులతో కలిసి విధ్వంసానికి పాల్పడమేగాక, అడ్డుకోబోయిన సీఐపైనా దాడి చేశారు. అయితే పిన్నెల్లిపై కక్షపూరితంగా కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నేతలు గతంలో ఆరోపించారు. కానీ ఈవీఎం ధ్వంసం చేయడం వల్లే ఈసీనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆదేశించిందింది. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి సోదరులతోపాటు అనుచరులపైనా కేసులు నమోదయ్యాయి.
ఈ నాలుగు కేసుల్లో అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి గత కొన్నిరోజులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇప్పటికే ధర్మాసనం మూడుసార్లు వాటిని పొడిగించింది. ఇటీవలే ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
దీంతో పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి మాచర్ల కోర్టుకు తరలించారు.ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన నాలుగు కేసుల్లో న్యాయమూర్తి విచారణ చేపట్టారు. రెండు కేసుల్లో పిన్నెల్లికి బెయిల్ మంజూరు కాగా, పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసు, కారంపూడి సీఐపై దాడి కేసులో 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పిన్నెల్లిని పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు.
ఎలాంటి సందేశం ఇస్తున్నారన్న నెటిజన్లు : ఈరోజు వైఎస్ జగన్ పిన్నెల్లితో ములాఖత్ అయ్యారు. మరి అలాంటి వ్యక్తిని జగన్ జైలుకు వెళ్లి మరీ కలవడంపై నెటిజన్లు సెటైరికల్‌గా స్పందిస్తున్నారు. ఒకరేమో అభివృద్ధి గురించి ఆలోచిస్తూంటే, మరొకరు మాత్రం నిందితులను కలవడంపై దృష్టి పెట్టారని వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టైన పిన్నెల్లిని జగన్ కలవడంతో ఎలాంటి సందేశం ఇస్తున్నారని నెటిజన్లు అంటున్నారు.
పిన్నెల్లి అరెస్టుతో మారిన పరిణామాలు!- పల్నాడులో ప్రశాంతత సాధ్యమేనా? - Former MLA pinnelli Anarchies