NDA Alliance Leaders Election Campaign : కూటమి అభ్యర్థులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్డీఏ అభ్యర్ధుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మెహన్‌తో కలిసి మెగా టౌన్ షిప్ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మినీ మ్యానిఫెస్టోను వివరించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య ఇంటింటికి ప్రచారాన్ని చేపట్టారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సౌమ్య స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా మాచవరంలో జరిగిన కూటమి ఆత్మీయ సమావేశంలో గురజాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా చీరాల కూటమి అభ్యర్థి ఎం.ఎం కొండయ్య మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. బల్లికురవ మండలంలో తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రాచారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 25వ డివిజన్‌లో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను అందజేసి ఓట్లు అభ్యర్థించారు.
పిఠాపురంలో బిజీ బిజీగా సాగిన పవన్ కళ్యాణ్ పర్యటన - Pawan Kalyan Pithapuram tour
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం అభ్యర్థులు ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి బుక్కపట్నం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాముదుర్తికి చెందిన 250 వైసీపీ కుటుంబాలు, ఆమడగూరు వైసీపీ సర్పంచ్ మాజీ మంత్రి పల్లె సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. కదిరి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ప్రచార జోరు పెంచారు. తలుపుల మండలం వేపమానిపేటలో ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అనంతపురం జిల్లా నార్పల మండలం సోదనపల్లిలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలుపు కొరకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కర్నూలు తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భాస్కర్ నగర్, గాంధీనగర్ వీధుల్లో సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నంద్యాల పార్లమెంటు అభ్యర్థి బైరెడ్డి శబరి ఎన్నికల ప్రచారాన్ని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్యే చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి, కడప ఎంపీ భూపేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికలలో కూటమి విజయం సాధించి తీరుగుతుందని కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. పి.గన్నవరంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సదస్సులో ఆమె పాల్గొన్నారు. సైకో జగన్ పాలనలో రాతియుగానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి స్వర్ణయుగం వైపు నడిపే సారధి చంద్రబాబేనని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి రాథాకృష్ణ అన్నారు. ఏలూరులోని పలు కాలనీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ విజయానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
సాలూరులో టీడీపీ అభ్యర్ధి గుమ్మడి సంధ్యారాణితో కలసి సాలూరులో కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రం పూర్వ స్థాయికి తీసుకురావాలంటే కూటమి అభ్యర్థులు గెలుపొందాలన్నారు. సమావేశంలో అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత కూడా పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ సంతకవిటి మండలం బొద్దూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో చేపట్టారు.చంద్రబాబు రూపకల్పన చేసిన సూపర్ సిక్స్.బీసీ డిక్లరేషన్‌లపై ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం కొనసాగించారు.