Nara Lokesh Shankharavam Meeting: జగన్ పాలనలో ప్రజల కష్టాలు-కన్నీరు నుంచే బాబు సూపర్ 6 మ్యానిఫెస్టో వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోక్‌శ్ అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో శంఖారావం సభకు హాజరైన లోక్‌శ్ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. కుర్చి మడతపెడతామంటే అంబటి చాలా బాధపడిపోతున్నారు అది కుర్చి కాదు సింహాసం అని అంటున్నారు. అది సింహాసనమే కానీ దానిపై కూర్చుంది శునకమని లోకేశ్ ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని జగన్ అన్నారు కాని జగన్ మద్యపాన నిషేధం చేశారా అని ప్రశ్నించారు. పెద్దఎత్తున సంక్షేమ పథకాలు తెలుగుదేశం అమలు చేసిందన్న ఆయన జగన్ చెప్పే అబద్ధాలు నమ్మవద్దు అన్నారు. అధికారంలోకి వచ్చాక శృంగవరపుకోట సమస్యలన్నీ తీర్చుతామన్నారు.
'ఆ కుర్చీనట్టా మడత పెట్టి' - సీఎం జగన్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్
జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది అందుకే ఎమ్మెల్యే సీట్లను మారుస్తున్నారని లోకేశ్ అన్నారు. క్రికెటర్ వైసీపీలోకి వస్తే ఎంతిస్తావని అతన్ని అడగడంతోనే , వాళ్ళ తాకిడి తట్టుకోలేక అతను పారిపోయాడని విమర్శించారు. జగన్ పాలనలో జరిగింది సామాజిక న్యాయం కాదని సామాజిక అన్యాయం లోక్‌శ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలనే జగన్ మారుస్తున్నారని ఆరోపించారు. బీసీలంటే జగన్‌కు చిన్నచూపని ఆపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే చెబుతున్నారంటూ గుర్తుచేశారు. బీసీలకు రావాల్సిన 10 శాతం రిజర్వేషన్‌ను కూడా ఇవ్వలేదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గుంటూరులో అమర్‌నాథ్ అనే బీసీ యువకుడిని వైసీపీ నేతలు దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. మాస్క్ అడిగిన డాక్టర్‌ను పిచ్చోడని ముద్రవేసి చంపేశారు, దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు జగన్ పక్కన కూర్చుంటారు. ఇలాంటి ఘటనలు ఒక్క జగన్ పాలనలోనే సాధ్యమని లోకేశ్ అన్నారు.
జగన్ మరో జన్మ ఎత్తినా అమరావతిని టచ్ చేయలేడు: నారా లోకేశ్
ఎర్ర పుస్తకాన్ని చూసి కూడా జగన్ వణికిపోతున్నారు అందుకే ఈ పుస్తకంపై కూడా జగన్ కేసు పెట్టారని లోకేశ్ అన్నారు. జగన్ కటింగ్ ఫిటింగ్ మాస్టర్ అని విమర్శించారు. పచ్చబటన్ నొక్కి జగన్ రూ.10 వేస్తున్నారు కాని కిందనున్న ఎర్ర బటన్ నొక్కి రూ.100 లాగుతున్నారని విమర్శించారు. జగన్ త్వరలో గాలిపై కూడా పన్ను వేస్తారని అన్నారు. వంద సంక్షేమ కార్యక్రామాలు కట్ చేసిన ఏకైక సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. వైసీపీ నేతలు చెప్పేవి పచ్చి అబద్ధాలని, నిజాలు చెప్తే వారి తల బద్ధలైపోయే జబ్బు జగన్‌కు, అతని అతని అనుచరులకు ఉందని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
ఉత్తరాంధ్రపై 3 కుటుంబాల పెత్తనం - కనిపించిన భూమినల్లా మింగేస్తున్నారు: లోకేశ్
ప్రతి ఇంటికీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లాలో అభివృద్ధి పనులు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. టీడీపీ- జనసేన వచ్చాక వచ్చాక భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్రను దోచుకోమని సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి జగన్ అప్పజెప్పారని అన్నారు. గిరిజన వర్సిటీ కోసం భూమి సేకరించి కేంద్రానికి ఇచ్చాము కాని ఇప్పడు జగన్ గిరిజన వర్సిటీ కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ- జనసేన అభ్యర్థిని గేలిపిస్తే ఎస్ కోట అభివృద్ధి చేసే బాధ్యత మాదని లోకేశ్ అన్నారు.