Nara Lokesh May Join in New Cabinet in AP : తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరనున్నారు. ఆయనకు ప్రాధాన్యమున్న మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల కథనం. సుదీర్ఘంగా యువగళం పాదయాత్ర చేసి ఎన్డీయే విజయంలో కీలక భూమిక పోషించిన నారా లోకేశ్ ఒక సందర్భంలో ఎన్నికల్లో గెలిచాక మంత్రి వర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.
కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి 4 స్థానాలు!- జనసేనకూ అవకాశం? - TDP join UNION CABINET
AP Cabinet Ministers List 2024 : తాజాగా ఓట్ల లెక్కింపు ముగిశాక విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంలో లోకేశ్ చేరతారాలేదా అన్న దానిపై పార్టీ వర్గాల్లో గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది.
నారా లోకేశ్ రెడ్ బుక్ అర్థం ఇదేనా ?- మంగళగిరిలో భారీ ఫ్లెక్సీ - Nara Lokesh Red Book
Nara Lokesh Into the Cabinet Chandrababu Naidu Take Decision : ఈ విషయంపై తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతోనే మంత్రి వర్గంలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు నిర్వహించారు. విశాఖ, మంగళగిరి, విజయవాడ కేంద్రాలుగా ఐటీ కంపెనీలు తీసుకురావడంలో, నరేగా తదితర శాఖల నిధులతో గ్రామాల్లో పాతిక వేల కిలోమీటర్లకుపైగా పొడవైన అంతర్గత రహదారుల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈసారి ప్రభుత్వంలో మరింత కీలక భూమిక పోషించే అవకాశముంది.