ETV Bharat / politics

స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండలేను - త్వరలో నిర్ణయం ప్రకటిస్తా: ఎమ్మెల్యే ఆర్థర్ - ఎమ్మెల్యే ఆర్థర్

Nandikotkur MLA Arthur met with YSRCP workers: నందికొట్కూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్థర్ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుపై కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో వారితో చర్చించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు పార్టీకీ రాజీనామా చేయాలని సూచించారు. రెండు రోజుల్లో తన నిర్ణయం వెల్లడిస్తానని ఎమ్మెల్యే ఆర్థర్ పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 8:27 PM IST

Nandikotkur MLA Arthur met with YSRCP workers: దళిత నేతలు పోటీపడుతున్న నియోజకవర్గాల్లో వారి అభిప్రాయాలకు, వారి పనితీరుకు ఎలాంటి సంబంధం లేకుండా టికెట్ కేటాయింపులు, తొలగింపులు జరుగుతున్నాయి. తొలగింపు విషయంలో కార్యకర్తలు, స్థానిక నేతల అభిప్రాయాల్ని సైతం లెక్క చేయడం లేదు. వైఎస్సార్సీపీ పెద్దలకు నచ్చిన వారిని, లేదా ఆ జిల్లాల్లో పెత్తనం చేస్తున్న నేతల నిర్ణయాలు మాత్రమే అంతిమంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్​ టికెట్ విషయంలో సైతం వైఎస్సార్సీపీ పెద్దల నిర్ణయంతో నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇంఛార్జ్‌గా సుధీర్‌ నియామకంపై నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు.

కార్యకర్తలతో ఎమ్మెల్యే ఆర్థర్ సమావేశం: నంద్యాల జిల్లా నందికొట్కూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్థర్, కర్నూలులోని ఓ హోటల్లో భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్సీపీ అధిష్టానం డాక్టర్ సుదీర్​ను ఇన్చార్జిగా నియమించింది. దీంతో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కార్యకర్తల సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించారు. అధిష్టానానికి మనం అవసరం లేనప్పుడు మనం కూడా ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని కార్యకర్తలు ఎమ్మెల్యేకు సూచించారు. భవిష్యత్తు కార్యచరణపై ఎమ్మెల్యే త్వరగా నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలు ఎమ్మెల్యేను కోరారు. రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఎమ్మెల్యే మీడియా సమావేశంలో తెలిపారు. తనను స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండాలని అధిష్టానం కోరడంతో తాను అంగీకరించనందుకే టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు.

స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండలేను - త్వరలో నిర్ణయం ప్రకటిస్తా: ఎమ్మెల్యే ఆర్థర్

విధ్వంసం, నాశనం చెయ్యడం తప్ప మార్పు తీసుకురావడం సీఎం జగన్​కు తెలుసా?: ఎమ్మెల్యే అనగాని

ఏపీలో నువ్వే నెంబర్ వన్ అన్నారు: ఐప్యాక్ తదితర సర్వేల్లో ఆర్థర్ ముందున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయినప్పటికీ ఆర్థర్​కు ఎమ్మెల్యే సీటు కేటాయించలేదు. గతంలో సైతం గడప గడపకు కార్యక్రమం, నియోజకవర్గాల్లో పర్యటనలు తదితర అంశాలపై సీఎం జగన్ మెచ్చుకున్నారు. అయితే, టికెట్ విషయంలో మాత్రం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్పిన వ్యక్తికే వైఎస్సార్సీపీ పెద్దలు తలొగ్గారు. చివరకూ ఎమ్మెల్యే ఆర్థర్ ముందు వైఎస్సార్సీపీ పెద్దలు ఓ ప్రతిపాదన పెట్టారని, పేరుకు మాత్రమే తనను ఎమ్మెల్యేగా ఉండమన్నారని, వేరే వ్యక్తులు నిర్వహణ చూసుకుంటారని చెప్పినట్లు ఆర్థర్ వెల్లడించారు. కానీ, పేరుకు మాత్రమే ఎమ్మెల్యే అయితే తనకు అవసరం లేదని చెప్పినట్లు ఆర్థర్ వెల్లడించారు.

సొమ్మొకరిది సోకొకరిది: నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్‌ పేరుకు మాత్రమే ఎమ్మెల్యే అని, నియోజకవర్గం నియంత్రణ అంతా శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధిపత్యం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి పని జరగాలన్నా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కనుసన్నల్లో జరగాల్సిందే, లేదంటే ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో పేరుకు మాత్రమే ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా కొనసాగుతుందని, పెత్తనమంతా వైఎస్సార్సీపీ పెద్దలదే అంటూ ఎమ్మెల్యే పలుమార్లు ఆవేదనను వ్యక్తం చేశారు.

జగన్‌రెడ్డి 3 రాజధానులు అని ఒక్కటీ పూర్తి చేయలేదు - రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు : వైఎస్ షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.