Mopidevi and Beeda Masthan Rao Resign MP : అధికారం కోల్పోయిన వైఎస్సార్సీపీకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు నచ్చక కొందరు రాజీనామాల బాట పట్టగా, మరికొందరు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా రాజ్యసభ పదవికి ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. ఈ మేరకు వారు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలు అందజేశారు. ఇద్దరి రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు.
Mopidevi Quit YSRCP : అంతకుముందు వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. మరో ఎంపీ బీద మస్తాన్‌రావుతో కలిసి రాజీనామా చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో తాను టీడీపీలో చేరబోతున్నట్లు తెలిపారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. అధికారం తనకు కొత్తేమీ కాదని మోపిదేవి వెంకటరమణ అన్నారు.
రాజీనామా పత్రాలు రెడీ! - బైబై జగన్ అంటున్న వైఎస్సార్సీపీ ఎంపీలు - ysrcp rajya sabha MPs
MP Beeda Masthan Rao Resign : గతంలో ఎన్నో పదవుల్లో పనిచేశానని మోపిదేవి వెంకటరమణ చెప్పారు. గత సంవత్సర కాలంగా తన నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఇబ్బంది పడ్డానని తెలిపారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులతో రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఘోరాతిఘోరమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వెల్లడించారు. మరికొంత మంది రాజీనామా చేశారని మోపిదేవి వ్యాఖ్యానించారు.
లోపం ఎక్కడ ఉందనే దానిపై వైఎస్సార్సీపీ అధిష్ఠానం విశ్లేషించుకోవాలని మోపిదేవి వివరించారు. అనుభవం ఉన్న నేత ముఖ్యమంత్రి చంద్రబాబు అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆయన గాడిలో పెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో పనిచేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో త్వరలో టీడీపీలో చేరబోతున్నానని వెల్లడించారు. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు మోపిదేవి వ్యాఖ్యానించారు.
వైఎస్సార్సీపీకి భారీ షాక్! - రాజీనామాకు సిద్ధమైన ఎంపీలు - YSRCP MPS RESIGN