ETV Bharat / politics

రాజాసింగ్​ హౌస్​ అరెస్ట్​ - బండి సంజయ్​పై కేసు నమోదు - అసలు చెంగిచెర్లలో ఏమైందంటే? - chengicherla Case Issues in TS

MLA Raja Singh House Arrest To Prevent Him To Visit Chengicherla : గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చెంగిచెర్ల వెళ్లి బాధితులను పరామర్శించేందుకు వెళ్తానంటే తనను అరెస్టు చేసినట్లు రాజాసింగ్​ తెలిపారు. మరోవైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​పై మేడిపల్లిలో కేసు నమోదైంది.

Case Booked on Bandi Sanjay in Chengicherla Issue
MLA Raja Singh House Arrest To Prevent Him To Visit Chengicherla
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 28, 2024, 4:49 PM IST

MLA Raja Singh House Arrest To Prevent Him To Visit Chengicherla : గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ను పోలీసులు హౌస్​ అరెస్టు చేశారు. చెంగిచెర్లకు వెళ్లి బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే, తనను అడ్డుకుని హౌస్​ అరెస్టు చేశారని రాజాసింగ్​ మండిపడ్డారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోలీ పండుగ రోజు చెంగిచెర్లలో హిందువులపై దాడి జరిగిందని, చాలా మంది మహిళలు, యువత గాయపడ్డారని రాజాసింగ్ తెలిపారు.

మాజీ సీఎం కేసీఆర్​ (KCR Governance) హయాంలో హిందువులపై దాడి జరిగిందని, రేవంత్​రెడ్డి హయాంలోనూ అదే తరహా దాడులు జరుగుతున్నాయని రాజాసింగ్ ఫైర్​ అయ్యారు. కేసీఆర్​కు రేవంత్ రెడ్డికి ఎలాంటి వ్యత్యాసం కనిపించడం లేదన్నారు. హిందువులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Rajasingh Comments on ward offices : 'వార్డు ఆఫీసులతో ప్రజల పనులు అవుతాయన్న నమ్మకం లేదు'

"చెంగిచెర్లలో హిందువులపై దాడి జరిగింది. చాలా మంది రాజకీయ నాయకులు వాళ్లను కలవడానికి వెళ్తే పోలీసులు ఆపేస్తున్నారు. బండి సంజయ్​ను ఆపేశారు. నేను వెళ్తానంటే హౌస్​ అరెస్టు చేశారు. బాధితులను కలుద్దామని అనుకున్నాను. పోలీసులు ఒకవైపే ఉంటున్నారు. దెబ్బలు తిన్నవారిపై కేసులు నమోదు చేశారు. అక్కడికి ఇతర పార్టీల నేతలు పోవచ్చు కానీ బీజేపీ నాయకులు మాత్రం పోవద్దా? మమ్నల్ని ఎందుకు ఆపుతున్నారు. హిందువులపై దాడులు జరిగితే మేము ఆగం. హౌస్​ అరెస్టులు ఎన్ని రోజులు చేస్తారు." - రాజాసింగ్​, గోషామహల్ ఎమ్మెల్యే

రాజాసింగ్​ హౌస్​ అరెస్ట్​ బండిసంజయ్​పై కేసు నమోదు -కారణం చెంగిచెర్ల ఘటనే

Case Booked on Bandi Sanjay in Chengicherla Issue : మరోవైపు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్​లో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్​పై కేసు నమోదైంది. బోడుప్పల్ నగర పాలక సంస్థ చెంగిచర్లలో హోలీ వేడుకల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ (Two Groups Attack in Chengicherla) చోటుచేసుకోవడంతో ఓ వర్గానికి చెందిన కొందరు మహిళలు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ విధించి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయపడిన వారిని పరామర్శిచేందుకు బుధవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఘట్​కేసర్ ఎంపీపీ వై.సుదర్శన్ రెడ్డి, భారీగా పార్టీ కార్యకర్తలతో తరలివచ్చారు.

'ఇందిరమ్మ ఇల్లు' ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి : బండి సంజయ్

అక్కడ విధులు నిర్వహిస్తున్న నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి, ప్రస్తుతం నిషేధిత ప్రాంతమని, గాయపడిన వారి వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. దీంతో పోలీసులకు-బండి సంజయ్ (Bandi Sanjay Arrest)కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులను నెట్టేసి మరీ బాధితులను కలవడానికి బీజేపీ నాయకులు వెళ్లారు. బాధితులను కలిసిన బండిసంజయ్​ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి స్థానికులతో వారి సమస్యలపై మాట్లాడారు. తనపై దాడి చేసి, కిందపడేసి తొక్కుకుంటూ వెళ్లారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్, ఘట్​కేసర్ ఎంపీపీ వై.సుదర్శన్ రెడ్డితో పాటు మరికొందరిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

BJP Sunil Solanki Reaction on Chengicherla Issue : కాంగ్రెస్ ప్రభుత్వం చెంగిచర్ల ఘటనను కంటి తుడుపు చర్యగా చూస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంగిచెర్ల ఘటనపై బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. 300 మంది ఒక మూకగా వచ్చి దళిత, గర్భిణీ స్త్రీలపై దాడి చేశారని ఆరోపించారు. గత భైంసా ఘటనను గుర్తు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెంగిచెర్లకు రావడానికి కాంగ్రెస్ వాళ్లకు మనసొప్పడం లేదని మండిపడ్డారు.

రాముని అక్షింతల కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదు : బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.