ETV Bharat / politics

ప్రజల దృష్టిని మళ్లించేందుకే కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు: ఎమ్మెల్యే ఆదినారాయణ - MLA Adinarayana on Jagan

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 4:04 PM IST

MLA Adinarayana Reddy Allegations on Former CM Jagan: గత ప్రభుత్వంలో వైఎస్సార్​సీపీ నేతలు చేసిన అరాచకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. అధికారం అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు స్వాహా చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు.

mla_adinarayana_on_jagan
mla_adinarayana_on_jagan (ETV Bharat)

MLA Adinarayana Reddy Allegations on Former CM Jagan: వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని అప్పటి సీఎం జగన్ 2 లక్షల కోట్ల రూపాయలు స్వాహా చేశారని మాజీ మంత్రి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విమర్శించారు. ఆ పార్టీ నేతలు మరో 3 లక్షల కోట్ల రూపాయల వరకు తిన్నారని విమర్శించారు. ఓట్ల లెక్కింపు జరిగి నేటికి రెండు నెలలు పూర్తయిందని రాష్ట్రంలో ఎటుచూసినా అక్రమాలు, కబ్జాలు అనేకం వెలుగులోకి వచ్చాయని అన్నారు. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్సార్​సీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

వాస్తవ విషయాలు పక్కనపెట్టి జగన్‌ దిల్లీలో ధర్నాకు దిగారని ఇష్టం వచ్చినట్లు అప్పు చేశారని ఆదినారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు 7 శ్వేతపత్రాల ద్వారా అనేక విషయాలను బయటపెట్టారని అన్నారు. ఈ 60 రోజుల్లో 1వ తేదీన ఉద్యోగులు, ఫించనుదారులు, సామాజిక భద్రతా ఫించన్లు ఠంచనుగా అందించిన ఘనత మహాకూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. ఈ సారి జగన్‌ను పులివెందుల్లో సైతం ఓడిస్తామని తెలిపారు. పులివెందల అభివృద్ధి పేరుతో 60 కోట్ల రూపాయల పనిని రూ.600 కోట్లకు చేసినట్లు చూపించి ఆ డబ్బులు కూడా చెల్లించలేదని మండిపడ్డారు.

నరకప్రాయంగా ఆముదాలవలస రహదారి - రోడ్డుపై గోతులు, దుమ్ము, ధూళితో ప్రయాణికుల అవస్థలు - Damaged Roads in Srikakulam

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి సున్నా అని త్వరలో వైఎస్సార్​సీపీ కూడా అదే స్థితికి రాబోతోందని అన్నారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో పరిశ్రమలు, సంస్థలు, నీటిపారుదల, మౌలిక వసతులు, పర్యాటకం బాగా వృద్ధి చెందుతాయని సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అమరావతి పనుల కోసం తొలిదశ నిధులు ఇచ్చారని అన్నారు. విశాఖ రైల్వేజోన్‌ త్వరలోనే క్లియర్‌ అవుతుందని విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని తెలిపారు. అలానే కడప స్టీల్‌ ప్రారంభమవుతుందని తెలిపారు.

అర్హులందరికీ ఇళ్లు వస్తాయని రాష్ట్రానికి కావాల్సినంత గ్రామీణ ఉపాధి లభిస్తుందని అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహా ఆ పార్టీకి చెందిన నాయకులు అనేక మంది జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. దస్త్రాలు దహనం, కాలువల్లో పారేయడం వంటివి వారి దుశ్చర్యలకు నిదర్శనాలుగా అభివర్ణించారు. జగన్‌ పాలనలో జరిగిన మద్యం విక్రయాల్లోనే భారీ కుంభకోణం బయటపడుతుందన్నారు. వైఎస్సార్​సీపీకి రాజకీయాలు లేకుండా చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తారనే భయంతోనే ఎమ్మెల్సీగా పోటీకి మాజీ మంత్రి బొత్సకు అవకాశం కలిపించారన్నారు. రాష్ట్రంలో కబ్జాలు, తప్పులు జరని ప్రాంతం ఏది లేదన్నారు.

కోతకు గురైన గోదావరి ఏటిగట్లు- స్థానికులను వెంటాడుతున్న వరద భయం - No Quality on Godavari Yetigatlu

'మదనపల్లె ఫైళ్ల దహనం'లో కీలక మలుపు- వైఎస్సార్సీపీ నేతలపై నాన్​ బెయిలబుల్​ కేసు - madanapalle fire accident case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.