Minister Uttam Kumar Reddy Comments on KCR : కేసీఆర్ పొగరు వల్లే 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్‌ఎస్ పార్టీ 39కి వచ్చారని, ఇందులో 26 మంది కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్(Gandhi Bhavan)లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లు కేసీఆర్‌కు చురకలు అంటించారు. బీఆర్‌ఎస్ అధినేతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి, కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ నీచపు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ ఆక్షేపించారు. కాంట్రాక్టర్ల కమీషన్ కోసం కేసీఆర్ బ్రోకర్‌గా పని చేశారని విమర్శించారు. వ్యక్తిగత లాభం కోసం కృష్ణా, సాగర్ జలాలు ఏపీ(AP)కి తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ను బొంద పెట్టడం గ్యారంటీ అన్నారు. సిగ్గు, శరం, లజ్జ వదిలేసి కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Minister Uttam Fites on KCR : కేసీఆర్ చేసిన దోపిడీకి వేరే దేశాల్లో అయితే ఉరి వేస్తారని మంత్రి ఉత్తమ్ దుయ్యబట్టారు. రాష్ట్రానికి కేసీఆర్ కరవు తీసుకువచ్చారని, ప్రస్తుతం ఉన్న నీటిని తాగుకు వ్యవసాయానికి ఎలా ఉపయోగించుకోవాలో చిత్తశుద్ధితో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్(KCR) చెప్పిన దొంగ మాటలు ప్రజలు నమ్మొద్దని, నష్టపోయిన ప్రతి రైతుకు తమ సానుభూతి, పరిహారం ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
"మేడిగడ్డ పోయి ధర్నా చేస్తారు అంట. ఏదో తొక్కుకుంటా పోతారు అంట. బీఆర్‌ఎస్ చివరికి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పనిరాని ప్రాజెక్టుగా చేసింది. వీరి పాలనలోనే మార్చేశారు. ఇప్పుడు ఆ బ్యారేజీలో ఏర్పడిన బుంగలను శాస్త్రీయ పద్ధతిలో పూడ్చే దాకా బ్యారేజీలో నీరు నింపడం ప్రమాదకరమని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడుతోంది." -ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి
కల్వకుంట్ల కుటుంబానికి శ్రీ కృష్ణ జన్మస్థానమే దిక్కు : కేసీఆర్ చవట, దద్దమ్మ కాకపోతే ధనిక రాష్ట్రాన్ని ఎలా లక్షల కోట్ల అప్పులు చేశారని మరో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. గద్దలాగా వాలుతాం అన్న నీవు నీ కుటుంబం ఇప్పటికే గద్దలాగా తినేశారని కేసీఆర్‌ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. పదేళ్లు సీఎంగా పని చేసి పాలమూరుకు ఏం చేశావో చెప్పాలని మంత్రి జూపల్లి నిలదీశారు.
మిషన్ భగీరథలో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)లో కల్వకుంట్ల పాత్ర ఉందని జూపల్లి చెప్పగా, తన ఫోన్‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఇప్పటికే డీజీపీ ఫిర్యాదు చేశామన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి శ్రీకృష్ణ జన్మస్థానమే దిక్కు అన్నారు.
"మేము రేపటి నుంచి ఫీల్డ్‌లో ఉంటాము. ఎవరు ఎవరిని తొక్కుతారో చూద్దామా కేసీఆర్?. సిరిసిల్ల చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలు వేయకపోతే బతుకు కొట్టినట్లా?. మీ అత్తగారి ఊరు అయిన మిడ్‌మానేరు ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించలేని అసమర్థులు మీరు. అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసిన పరిస్థితులలో పోలీసుల పహారాలోకి పోయారు. కేసీఆర్ మాట్లాడిన భాషకు తాము ఇప్పుడు అలానే మాట్లాడితే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటారు." - పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి
లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ మనుగడ ప్రశ్నార్థకం : ఉత్తమ్ - Minister Uttam Kumar Press Meet