ETV Bharat / politics

తెలంగాణలో త్వరలో జాబ్​ క్యాలెండర్​ - 2 లక్షల ఉద్యోగాల భర్తీ : మంత్రి శ్రీధర్​బాబు - Telangana Job Calendar 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 1, 2024, 2:02 PM IST

Telangana Job Calendar 2024 : అతి త్వరలో జాబ్‌ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్​బాబు పేర్కొన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్​బాబు ప్రవేశపెట్టారు.

TS_minister_sridhar_babu
TS_minister_sridhar_babu (ETV Bharat)

Job Calendar in Telangana 2024 : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బిల్లును ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. అతి త్వరలో జాబ్‌ క్యాలెండర్ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్త చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు కల్పించినా, మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని, ప్రభుత్వం పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని శ్రీధర్‌బాబు తెలిపారు.

ప్రాక్టికల్​ బోధన : పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు గ్రాడ్యుయేట్లలో కొరవడ్డాయని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నైపుణ్యాల పెంపుపై పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామని, 'యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ' స్థాపనకు ప్రతిపాదిస్తున్నామన్నారు. నైపుణ్యాల పెంపొందించే ఉద్దేశంతోనే 'యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ' స్థాపన జరుగుతోందని, అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్‌ కాంపొనెంట్‌ను కలిగి ఉంటాయని స్పష్టం చేశారు.

స్కిల్‌ యూనివర్సిటీ యువతకు ఉపాధి కల్పిస్తుందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుందని మంత్రి శ్రీధర్​బాబు పేర్కొన్నారు. తెలంగాణలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు స్కిల్‌ వర్సిటీ ఊతమిస్తోందని తెలిపారు. 2024-25 సంవత్సరంలో 2000 మంది విద్యార్థులకు, వచ్చే ఏడాది 10 వేల మందికి శిక్షణ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ముచ్చర్లలో స్కిల్‌ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. స్కిల్‌ యూనివర్సిటీ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు తెలపాలని కోరారు.

ఎమ్మెల్యే పదవికి జగన్​ రాజీనామా చేయాలి- మోసాలు ఆయనకు కొత్త కాదు: షర్మిల - YS SHARMILA TWEET ON JAGAN

బీఆర్ఎస్​పై శ్రీధర్​బాబు ఫైర్ : గులాబీ నేతలపై మంత్రి శ్రీధర్​బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గట్టిగా నినాదాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు. సభలో బీఆర్ఎస్​ వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని, యువత ప్రయోజనం కంటే బీఆర్ఎస్​కు రాజకీయ భవిష్యత్తే ముఖ్యం అనుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధాంతాలు వేరైనప్పటికీ యువత భవిష్యత్‌ కోసం సహకరిస్తున్నారని, రాష్ట్ర యువత బీఆర్ఎస్​ సభ్యుల చేష్టలను గమనిస్తోందని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని జగన్ కేంద్రానికి లేఖ రాశారు : మంత్రి నిమ్మల - Polavaram project issue on Council

"రాష్ట్రంలో త్వరలో జాబ్​ క్యాలెండర్​ను విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాము. నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. వారికి ప్రభుత్వరంగంలోనే కాకుండా ప్రైవేట్​ రంగంలోనూ ఉపాధి కల్పనకు కృషిచేస్తాము". - శ్రీధర్​బాబు, మంత్రి.

నల్లబ్యాడ్జీలతో రాక : మరోవైపు నిన్న అసెంబ్లీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు​ నల్ల బ్యాడ్జీలతో శాసనసభకు వచ్చారు. సభాపతి నల్ల డ్రెస్‌తో రావడంపై హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు మద్దతుగా నల్ల డ్రస్‌తో వచ్చిన స్పీకర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

18 ఏళ్లు పైబడిన మహిళలకు ఆర్థిక సాయం-'మహాశక్తి'ని త్వరలోనే ప్రారంభిస్తాం: మంత్రి సంధ్యారాణి - Discussion on Mahashakti scheme

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.