Minister Narayana Conducted the Review with Authorities: పురపాలక శాఖలో ఉన్న ఆస్తుల పంపకాలపై రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో హౌసింగ్ బోర్డు, సంబంధిత అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు. రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు పూర్తి కావడంతోపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా ముగిసిందని సమీక్షలో మంత్రి వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదని ఆయన అన్నారు. ఇప్పటికే వేల కోట్ల ఆస్తులు ఉన్న సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉందని అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి పేర్కొన్నారు.
సమస్యల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: మంత్రి నారాయణ - Minister Narayana on municipalities
తొమ్మిది, పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల మధ్య విభజన ఇంకా కొలిక్కి రావడం లేదని ఆయన తెలిపారు. పునర్విభజన చట్టంలో ఏపీ, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకునేలా ఉందని ఆ తర్వాత పంపకాల విషయంలో ఏ రాష్ట్రానికే సంబంధించినవి ఆ రాష్ట్రానికే చెందాలనే కొత్త అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని సంస్థలు పంచాయతీ రాజ్ శాఖకు చెందినవి కూడా ఉన్నాయని అలాంటి సంస్థలకు చెందిన వివరాల కోసం మంత్రి నారాయణ ఆరా తీశారు.
రెల్లి కాలనీలో పర్యటించిన మంత్రి - సమస్యలను అడిగి తెలుసుకున్న నారాయణ - Minister Narayana visit
షీలా బిడే కమిటీ నివేదిక ప్రకారమే ముందుకెళ్లాలని ఆయన నిర్ణయించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఆస్తులపై గతంలోనే జనాభా ప్రాతిపదికన విభజించారని అధికారులు తెలిపారు. విభజన ప్రణాళికను పరిశీలించిన నిపుణుల కమిటీ కొన్ని సిఫార్సులు చేసినట్టు అధికారులు తెలిపారు. వీటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి సుమారు 5,170 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. ఆయా సంస్థల ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉన్న కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని శాఖలన్నింటినీ వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసింది: మంత్రులు - Ministers Review Meetings