You will study at IIIT Lucknow.
— Lokesh Nara (@naralokesh) August 4, 2024
You will pursue your dream.
Let me take care of the fee.
All the best Basavayya! https://t.co/622Q5jiR8X
Nara Lokesh Help to IIIT Lucknow Student Basavaiah : సాయం కోరిన వారందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి నిరూపించుకున్నారు. ఓ పేద విద్యార్థి ట్రిపుల్ ఐటీ లక్నోలో చదవాలన్న కలను నెరవేర్చారు. విద్యార్థి మొదటిసెమిస్టర్‌కు ఆర్థిక సాయంగా లక్షా 16 వేల రూపాయల చెక్కును పంపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
Lokesh Financial Support to Student Basavaiah : పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపు గట్టుకు చెందిన విద్యార్థి బసవయ్య ట్రిపుల్ లక్నో సీట్ లభించింది. అయితే కోర్సు ఫీజ్ సుమారు రూ.4లక్షలు ఉంది. విద్యార్థి కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో కోర్సు ఫీజు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. బసవయ్య తల్లిందండ్రలకు ఏమీ చేయాలో అర్థం కాలేదు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వచ్చిన ఆ డబ్బులతోనే ఇప్పటివరకూ చదివించారు. పిల్లాడికి ఇంకా చదివించాలని వారికి కోరిన ఉన్న ఆర్థిక స్థోమత లేకపోవడంతో సతమతమైపోయారు. పరీక్షలో 930వ ర్యాంకు సాధించి, ట్రిపుల్ ఐటీ లక్నోలో మొదటి కౌన్సిలింగ్‌లోనే సీట్ లభించింది. కానీ ఆ కోర్సు మొత్తానికి సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఫీజు చెల్లించాలని తెలియడంతో బసవయ్య ఆశలన్నీ ఆవిరై పోయాయి. తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
గంటలోపు లోకేశ్ స్పందన : ఈ నెల 4వ తేదీన విద్యార్థి బసవయ్య తన సమస్య గురించి నారా లోకేశ్‌కు ట్విటర్ (X) వేదికగా తెలియజేశారు. విద్యార్థి ట్వీట్ చేసిన గంటలోనే మంత్రి సానుకూలంగా స్పందించి భరోసా కల్పించారు. లోకేశ్ రీట్వీట్ చేస్తూ.. ఫీజు గురించి ఆలోచించకుండా చదువు మీద దృష్టి పెట్టాలని బసవయ్యకు సూచించారు. లోకేశ్ కార్యాలయం నుంచి సిబ్బంది బసవయ్యను సంప్రదించి వివరాలు తీసుకున్నారు.
బసవయ్య ఆనందం : విద్యార్థి మెుదటి సెమిస్టర్‌కు ఆర్థిక సాయంగా లక్షా 16 వేల రూపాయల చెక్కును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు పంపించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ చెక్కును ఎమ్మెల్యే బసవయ్యకు అందజేశారు. లోకేశ్ స్పందించిన తీరు పట్ల విద్యార్థి ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
వైద్య విద్యార్థినికి మంత్రి లోకేశ్ ఆర్థికసాయం - Minister Lokesh Help
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి : ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.. సాయం కోరిన వారందరికీ నారా లోకేశ్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని అన్నారు. మొత్తం నాలుగు సెమిస్టర్లకు సుమారు రూ.4 లక్షల ఖర్చవుతుందని, తొలి విడతగా లక్షా 16 వేల చెక్కు ఇచ్చామని తెలిపారు. బసవయ్య చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.
మంత్రి లోకేశ్ చొరవ - కువైట్ నుంచి స్వస్థలానికి చేరుకున్న శివ - TELUGU WORKER SHIVA COME TO AP