ETV Bharat / politics

ధాన్యం సేకరణలో మిగిలిన బకాయిలను పదిరోజుల్లో రైతులకు చెల్లిస్తాం: మంత్రి నాదెండ్ల - Minister Nadendla SPEECH

Minister Nadendla on Grain Collection Arrears: రైతుల బకాయిలు చెల్లించడమే అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల అన్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణకు సంబంధించి మిగిలిన బకాయిలను పదిరోజుల్లో రైతన్నలకు తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు.

Minister_Nadendla_on_Grain_Collection_Arrears
Minister_Nadendla_on_Grain_Collection_Arrears (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 3:35 PM IST

Minister Nadendla on Grain Collection Arrears: ధాన్యం సేకరణకు సంబంధించి మిగిలిన రూ.674 కోట్ల బకాయిలు పదిరోజుల్లో రైతులకు చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టంచేశారు. రైతుల బకాయిలు చెల్లించడాన్నే అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుని చెల్లిస్తామని అన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతు బజార్ల ద్వారా నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని రాయితీపై ప్రజలకు అందిస్తున్నామన్నారు.

చౌక ధరల దుకాణాల ద్వారా ఇచ్చే సరకులను నాణ్యంగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 251 స్టాక్ పాయింట్లను తనిఖీ చేసి నాణ్యత కల్గిన వస్తువులనే ఇవ్వాలని ఆదేశించామని పేర్కొన్నారు. నాణ్యత లేకుండా వస్తువులను పంపిణీ చేసిన 19సంస్థలపై చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం సేకరణ, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమాధానం ఇచ్చారు.

గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి రూ.2,763 కోట్లు బకాయిలు పెట్టిందని ఆరోపించారు. ధాన్యం సేకరణ పేరిట సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి గత ప్రభుత్వం 39,550 కోట్ల రూపాయల అప్పులు చేసిందని అన్నారు. అయితే రుణాలు తెచ్చిన జగన్ ప్రభుత్వం రైతుల బకాయిలు మాత్రం చెల్లించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు రూ.2వేల కోట్ల బకాయిలు చెల్లించామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు.

కాకినాడ కేంద్రంగా ఆఫ్రికన్ దేశాలకు రేషన్ బియ్యం- సీఐడీతో దర్యాప్తు చేయిస్తామన్న మంత్రి మనోహర్ - Ration rice mafia

కాకినాడ పోర్టును ద్వారంపూడి కుటుంబం ఆక్రమించింది: మంత్రి నాదెండ్ల - Nadendla Manohar on Ration Rice

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.