ETV Bharat / politics

మద్యంపై ఆదాయం కంటే ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: మంత్రి కొల్లు రవీంద్ర - Kollu Met with Liquor Companies - KOLLU MET WITH LIQUOR COMPANIES

Minister Kollu Ravindra Meeting with Liquor Companies: జగన్ ప్రభుత్వంలో వైఎస్సార్​సీపీ నేతల మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ప్రజల ప్రాణాలు హరించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సచివాలయంలో మద్యం తయారీ ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

kollu_met_with_liquor_companies
kollu_met_with_liquor_companies (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 9:41 PM IST

Minister Kollu Ravindra Meeting with Liquor Companies: ప్రజల ప్రాణాలు హరిస్తున్న కల్తీ మద్యం బ్రాండ్ల నుంచి విముక్తి కలిగించేలా త్వరలోనే మెరుగైన పాలసీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సచివాలయంలో మద్యం తయారీ ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని కేవలం ప్రైవేటు వ్యాపారంగా మాత్రమే భావించిందని తెలిపారు. దేశం మొత్తం లభించే బ్రాండ్లను మన రాష్ట్రంలో కూడా అందుబాటులో ఉంచిందని అన్నారు.

2019లో ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్సార్​సీపీ నేతలు మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ప్రజల ప్రాణాలు హరించారని మంత్రి రవీంద్ర మండిపడ్డారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు, మద్యం అమ్మకాలకు ముడి వేసి ప్రజల ఆదాయాన్ని హరించారని అన్నారు. అమ్మకాలకు, కొనుగోళ్లకు సంబంధమే లేకుండా వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. దేశమంతా డిజిటల్ పేమెంట్ల వైపు వెళ్తుంటే రాష్ట్రంలో మాత్రం క్యాష్ అండ్ క్యారీ విధానంలో మద్యం అమ్మకాలతో వేల కోట్లు లూటీ చేశారని అన్నారు.

22వ రోజు ప్రజాదర్బార్‌- జోరువానలోనూ వినతుల వెల్లువ - Lokesh Praja Darbar 22nd Day

వినియోగదారుడు తనకు నచ్చిన బ్రాండ్ కాకుండా ధర చెప్పి కొనుగోలు చేసే దుస్థితి కల్పించారని మంత్రి మండిపడ్డారు. పైగా కల్తీ మద్యం తీసుకొచ్చి వేలాది మంది మరణాలకు, అనారోగ్యానికి కారమయ్యారని అన్నారు. మద్యం పేరుతో వైఎస్సార్​సీపీ నేతల అక్రమాలను త్వరలోనే బయటపెడతామని అన్నారు. అక్టోబర్ 1 నాటికి నూతన మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అందుకోసం మెరుగైన పాలసీల కోసం అధ్యయనం చేస్తున్నామని అన్నారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం మద్యాన్ని కేవలం ప్రైవేటు వ్యాపారంగా మాత్రమే భావించింది. దేశం మొత్తం లభించే బ్రాండ్లను మన రాష్ట్రంలో కూడా అందుబాటులో ఉంచింది. ఆతరువాత జగన్ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్​సీపీ నేతలు మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ప్రజల ప్రాణాలు హరించారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. సంక్షేమ పథకాలకు, మద్యం అమ్మకాలకు ముడి వేసి ప్రజల ఆదాయాన్ని హరించారు. అమ్మకాలకు, కొనుగోళ్లకు సంబంధమే లేకుండా వేల కోట్లు దోచుకున్నారు. దేశమంతా డిజిటల్ పేమెంట్ల వైపు వెళ్తుంటే రాష్ట్రంలో మాత్రం క్యాష్ అండ్ క్యారీ విధానంలో మద్యం అమ్మకాలతో వైఎస్సార్​సీపీ నేతలు వేల కోట్లు లూటీ చేశారు.- కొల్లు రవీంద్ర, మంత్రి

భువనేశ్వరి కోసం రెండు చీరలు కొన్న చంద్రబాబు - CBN in Handloom Day Celebrations

'లేపాక్షి భూముల వేలంలో అక్రమాలు- జగన్​ బంధుమిత్రులకు భారీగా లబ్ధి' - Lepakshi lands

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.