ETV Bharat / politics

2028లో 100కు పైగా సీట్లు గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి - KV Ramana Reddy Fires on Congress - KV RAMANA REDDY FIRES ON CONGRESS

KV Ramana Reddy Fires on Congress : పక్కవాళ్లను ఎంతమందినైనా తొక్కి పైకి రావాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేరని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. మహబూబ్​నగర్ పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

BJP Candidates Election Campaign
KV Ramana Reddy Fires on Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 7:42 PM IST

Updated : Apr 12, 2024, 7:52 PM IST

2028లో 100కు పైగా సీట్లు గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

KV Ramana Reddy Fires on Congress : పక్క వాళ్ల గురించి ఆలోచించకుండా, ఎంతమందినైనా తొక్కి పైకి రావాలనే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగలేరని కామారెడ్డి శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్​నగర్ పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన కేవీఆర్, రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పించారు.

ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ సొంత నియోజకవర్గంలో ప్రచారం చేయకపోయినా గెలిస్తే అది నిజమైన గెలుపని వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో ఓడిపోతానని తెలిసి, కొడంగల్​లో ముఖ్యమంత్రి అవుతానని ప్రచారం చేసినందుకే రేవంత్ గెలిచారని, లేదంటే కొడంగల్​లోనూ ఓడిపోయేవారన్నారు. కేసీఆర్​ మీద వ్యతిరేకతే కాంగ్రెస్​ను గెలిపించిందని చెప్పారు. కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నప్పుడు విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్జి, ఇప్పుడు ఎందుకు ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్​లో (Congress Joinings) చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే, ప్రస్తుత సీఎం రేవంత్ నడుస్తున్నారని విమర్శించారు.

దేశాన్ని 4 ముక్కలు చేసి విభజించిన మూర్ఖత్వపు పార్టీ కాంగ్రెస్‌ : బండి సంజయ్​ - Lok Sabha Elections 2024

BJP Candidates Election Campaign : ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి జడ్పీటీసీ స్థాయిలోనే ఆలోచిస్తున్నారని, కేసీఆర్​పై విమర్శలు తప్ప రాష్ట్ర సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, రైతలకు వ్యవసాయానికి కావాల్సిన సాగు నీరు ఎలా ఇవ్వాలి, తాగునీటి సమస్యలు ఎలా అధిగమించాలన్న శ్రద్ద రేవంత్ రెడ్డికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రుణమాఫీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, ఆ డబ్బులు రైతులకు అందకుండా ఆపిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచినా ఇంకా అమలు చేయలేదని అన్నారు. ఆరు గ్యారంటీలు లేవు, అసలు ఆయనకే గ్యారంటీ లేదంటూ రేవంత్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"గ్యారంటీ లేని మనిషి ఎవరంటే రేవంత్ రెడ్డి. అపనమ్మకానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి. నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ నలుగురు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు గెలవచ్చు. కానీ 2028లో వందకు పైగా సీట్లు గెలిచి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది అంతా కేవలం కార్యకర్తలతోనే సాధ్యం అవుతుంది. అందరూ మీ బలాన్ని గుర్తుంచుకోండి. కామారెడ్డిలో ఇద్దరు వచ్చారు అయినా నేనే గెలుస్తా అని చెప్పినా. ఎందుకంటే అక్కడ 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం. 10 వేల మంది కార్యకర్తలు ప్రజల మధ్య ఉన్నారు." - కాటిపల్లి వెంకట రమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే

కాంగ్రెస్ బీఆర్ఎస్​కు మజ్లిస్ రహస్య సంధి కుదురుస్తోంది : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ - BJP MP LAXMAN Slams ocngress

17 లోక్​సభ స్థానాల్లో (Lok Sabha Elections 2024) అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్​నగర్​లో డీకే అరుణను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. కార్యకర్తలు బూత్​ స్థాయిలో కష్టపడి పని చేస్తే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకే గెలుపు సొంతం అవుతుందని అన్నారు. నరేంద్ర మోదీ బాటలో అందరు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

కాంగ్రెస్​లో శిందేలు లేకపోతే - రేవంత్​ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు : ఎమ్మెల్యే మహేశ్వర్​ రెడ్డి - BJP Mla Maheshwar Reddy On Congress

Last Updated : Apr 12, 2024, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.