ETV Bharat / politics

17 పార్లమెంట్‌ నియోజకవర్గాలు - 5,500 కిలోమీటర్లు - 12 రోజులు - బీజేపీ రథయాత్ర నేడే ప్రారంభం - BJP Bus Yatra Details

Kishan Reddy on Vijaya Sankalpa Yatra : పార్లమెంట్ ఎన్నికల సమరశంఖం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మెజార్టీసీట్లలో గెలుపై లక్ష్యంగా కమలదళం ప్రజల వద్దకు వెళ్తోంది. నేటి నుంచి మార్చి 2 వరకు విజయ సంకల్పయాత్రల పేరిట రథయాత్రలు చేపడుతోంది. పార్లమెంట్‌ నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా విభజించింది.

Kishan Reddy on Vijaya Sankalpa Yatra
Telangana BJP Bus Yatra Details
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 7:36 PM IST

Updated : Feb 20, 2024, 8:00 AM IST

17 పార్లమెంట్‌ నియోజకవర్గాలు- 12 రోజుల్లో- 5,500 కిలోమీటర్ల బీజేపీ రథయాత్ర నేడే ప్రారంభం

Kishan Reddy on Vijaya Sankalpa Yatra : రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కనీసం పదిసీట్లు, 35 శాతం ఓటు బ్యాంకే లక్ష్యంగా నేటి నుంచి రథయాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 114 స్థానాలు 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలను ఐదు క్లస్టర్స్‌గా విభజించింది. 5,500 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టనుంది. ఆయాత్రల్లో 106 సమావేశాలు, 102 రోడ్‌షోలు, 180 రిసెప్షన్స్‌, 79 ఈవెంట్స్‌ నిర్వహించేలా ప్రణాళికలు చేసింది. నేడు 4 క్లస్టర్స్‌లో యాత్రలకి శ్రీకారం చుడుతోంది. మేడారం జాతరతో కాకతీయ- భద్రకాళీ క్లస్టర్‌యాత్ర రెండు, మూడ్రోజులు ఆలస్యంగా మొదలుకానుంది. యాత్రల ప్రారంభానికి అసోం, గోవా ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

టార్గెట్ 17 ఎంపీ స్థానాలు - ఈనెల 20 నుంచి బస్సు యాత్రలు : కిషన్‌రెడ్డి

Kishan Launch Jan Sandesh Digital Edition : హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో జన సందేశ్ డిజిటల్ ఎడిషన్‌ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. విజయ సంకల్ప యాత్ర పాటలు, గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతిరోజు యాత్ర రెండు నుంచి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతుందని తెలిపారు. బైంసాలోని సరస్వతి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కొమురం భీం యాత్రను అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ప్రారంభిస్తారన్నారు. ఈ యాత్ర(BJP Bus Yatra) ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్‌లలో 1056కిలో మీటర్ల మేర జరుగుతుందన్నారు. రాజరాజేశ్వరీ యాత్ర తాండూరులో ప్రారంభమవుతుందన్నారు.

BJP Bus Yatra In Telangana : ఈ నెల 26న బీజేపీ బస్సు యాత్ర ప్రారంభం.. ముగింపు సభకు ప్రధాని మోదీ

తెలంగాణలో బీజేపీ బస్సు యాత్రల పేర్లు, వివరాలు :

క్రమ సంఖ్యయాత్ర పేరునిర్వహించే నియోజకవర్గాలుప్రారంభమయ్యే ప్రదేశం ప్రారంభించే వ్యక్తి
1కొమురం భీమ్ యాత్రఅదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్బైంసాహిమంత విశ్వ శర్మ(అస్సాం ముఖ్యమంత్రి)
2శాతవాహన యాత్రకరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్లతాండూరు-
3కాకతీయ యాత్రఖమ్మం, వరంగల్, మహబూబాబాద్మేడారం జాతర వల్ల ఆలస్యం-
4కృష్ణమ్మ యాత్రమహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండకృష్ణ గ్రామంపురుషోత్తం రుపాలా(కేంద్రమంత్రి)
5భాగ్యలక్ష్మీ యాత్రభువనగిరి, మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్భువనగిరి ప్రమోద్ సావంత్ (గోవా ముఖ్యమంత్రి)

Telangana BJP Bus Yatra Details : భాగ్యలక్ష్మీ యాత్రను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారని, భువనగిరి నుంచి ప్రారంభం అవుతుందని కిషన్​రెడ్డి తెలిపారు. ఈ యాత్ర భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్​లలో జరుగుతుందని వివరించారు. కాకతీయ భద్రాద్రి యాత్ర సమ్మక్క సారలమ్మ జాతర వల్ల ఆలస్యంగా ప్రారంభం అవుతుందని చెప్పారు. కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర మక్తల్​లోని కృష్ణ గ్రామం నుంచి ప్రారంభమై మహబూబ్​నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్​లలో జరుగుతుందని దీనిని కేంద్రమంత్రి పురుషోత్తం రుపాలా ప్రారంభిస్తారని తెలిపారు. యాత్రలన్నీ పూర్తిగా రోడ్‌ షో తరహాలోనే ఉంటాయన్నారు.

"రాష్ట్రంలో ఐదు యాత్రలు నిర్వహించబోతున్నాం. ఒక యాత్ర మేడారం జాతర వల్ల ఆలస్యంగా మొదలవుతోంది. మిగతావి ఈరోజు ప్రారంభమవుతాయి. యాత్ర పూర్తిగా రోడ్​ షో మాదిరిగా ఉంటుంది. బీఆర్ఎస్​, కాంగ్రెస్​ పార్టీల వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తాం. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలే. ప్రజల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాల్లో గెలుస్తుంది."- కిషన్​ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishan Reddy Comments on Congress : బీఆర్ఎస్​, కాంగ్రెస్‌ అవినీతి, అరాచకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. విపక్ష కూటములపై ప్రజలకు నమ్మకం లేదని పేర్కొన్నారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేయబోతుందని, బీఆర్​ఎస్​తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కుట్రలను తిప్పికొట్టాలని కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. మొదటి పార్లమెంటరీ బోర్డు సమావేశం తరువాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. మొత్తం 5,500 కిలోమీటర్ల మేర జరగనున్న విజయ సంకల్ప యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారని పేర్కొన్నారు.

BJP MLA Candidates Selection Telangana 2023 : ఎమ్మెల్యే టికెట్‌కు ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తులు స్వీకరణ

Last Updated : Feb 20, 2024, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.