ETV Bharat / politics

పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లు కేటాయించింది : కిషన్ రెడ్డి - KISHAN REDDY ON CENTRAL FUNDS

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 4:33 PM IST

kishan Reddy On Pragathi Nivedika : తనపై ఇప్పటివరకు ఒక్క అవినీతి మచ్చకూడా లేదని కేంద్ర మంత్రి కిషన్ ​రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో గత పదేళ్లలో చేసిన అభివృద్ధిని ఆయన ప్రగతి నివేదిక పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

kishan Reddy On Pragathi Nivedika
kishan Reddy On Pragathi Nivedika

kishan Reddy On Pragathi Nivedika : పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. పార్టీ లేకపోతే తాను లేనని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్​ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని 'ప్రగతి నివేదిక' పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్రమంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ లేదని కేంద్ర మంత్రి కిషన్ ​రెడ్డి పేర్కొన్నారు. ఒక బిల్డర్, కాంట్రాక్టర్ అనేవారు ఇప్పటివరకు తెలియదని వివరించారు. ఇప్పటివరకు ఏ గుత్తేదారును తాను బెదిరించలేదన్నారు. ఎప్పుడూ ఎవరిపైనా పక్షపాతధోరణితో వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై కొందరు చెప్పలేని భాషలో విమర్శలు చేశారన్న కిషన్​ రెడ్డి అలాంటి వారికి ప్రజలే గతంలో బుద్ధి చెప్పారన్నారు. రాబోయే రోజుల్లో కూడా బుద్ధి చెబుతారన్నారు. తాను ప్రజలకు సేవ చేశానని భావిస్తేనే ఓటు వేయాలని లేదంటే వద్దని కేంద్రమంత్రి తెలిపారు. తనను గెలిపిస్తే మళ్లీ మీకు(ప్రజలకు) సేవచేసుకుంటానని ఆయన వివరించారు.

ప్రజలు భవిష్యత్ కోసం ఓటు వేయాలి : కిషన్ ​రెడ్డి మిత్రుడుగా మాత్రమే కాదని ఒక ఓటరుగా ఈ కార్యక్రమానికి వచ్చినట్లు లోక్​సత్తా నేత జయప్రకాష్‌నారాయణ అన్నారు. దేశాభివృద్ధి కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు భవిష్యత్‌ కోసం ఓటు వేయాలని జయప్రకాష్ నారాయణ సూచించారు. రాష్ట్రాల హక్కుల కోసం పోరాడాలి కానీ అందుకోసం దేశాన్ని విచ్చిన్నం చేయవద్దన్నారు.

BJP Focus On Telangana Lok sabha Seats : దేశవ్యాప్తంగా 400 లోక్​సభ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ తెలంగాణపైనా దృష్టి సారించింది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు సాధించాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. కొద్ది రోజుల క్రితమే 'సంకల్పపత్ర' పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన ఆ పార్టీ తాజాగా ప్రచార కార్యక్రమాల్లోనూ వేగం పెంచింది. ఆ పార్టీ నాయకులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వారు ప్రజల్లోకి వెళ్లి బీజేపీ పథకాలను వివరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాని మోదీ, అమిత్ షాలు పలుమార్లు రాష్ట్రానికి వచ్చి బీజేపీ కార్యకర్తల్ని కార్యోన్ముకుల్ని చేశారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ మేనిఫెస్టో : కిషన్​ రెడ్డి - Kishan Reddy on BJP Manifesto 2024

లోక్‌సభ ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్న కమలం - కిషన్​ రెడ్డి వైఖరే కారణం! - Lok sabha election 2024

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు, అవినీతి కుంభకోణాలు : కిషన్‌ రెడ్డి - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.