ETV Bharat / politics

కేసీఆర్‌ అన్న కుమారుడు కన్నారావు అరెస్ట్‌ - చర్లపల్లి జైలుకు తరలింపు - Kalvakuntla Kanna Rao Controversy - KALVAKUNTLA KANNA RAO CONTROVERSY

KCR's Brother Son Kalvakuntla Kanna Rao Arrested : బీఆర్​ఎస్​ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మన్నెగూడ భూ వివాదంలో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు ఏ1గా పేర్కొన్నారు. ఈ క్రమంలో నేడు అతడిని అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపరచగా కన్నారావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

KCR's Brother Son Kalvakuntla Kanna Rao Arrested

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 10:41 PM IST

KCR's Brother Son Kalvakuntla Kanna Rao Arrested : తెలంగాణలోని మన్నెగూడ భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మన్నెగూడలోని రెండు ఎకరాల భూ వివాదం కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అసలేం జరిగిందంటే.. ఓఎస్‌ఆర్ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పీ అనే వెంచర్లో మన్నెగూడలో సర్వే నంబర్ 32/బుు లో సుమారు రెండు ఎకరాల భూమి ఉంది. కాగా గత నెలలో తమకు చెందిన ఈ భూమిని కన్నారావు కబ్జాకి యత్నించారని, అడ్డువస్తే తనని తన కుటుంబాన్ని చంపేస్తానని బెదరించినట్లు బాధితుడు బండోజు శ్రీనివాస్ ఆదిభట్ల పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనా కూడా మళ్లీ కబ్జాకి యత్నించారని గత నెల 3న మరో ఫిర్యాదు చేశారు.

Kalvakuntla Kanna Rao Controversy : పోలీసుల వివరాల ప్రకారం.. ఓఎస్‌ఆర్ ప్రాజెక్ట్​ సంస్థకు చెందిన ప్రతినిధులు ఆ భూమిలో కంటైనర్​లో నివసిస్తున్న సమయంలో, కల్వకుంట్ల కన్నారావు, జక్కిడి సురేందర్, జక్కిడి హరినాథ్‌, శివ, డానియెల్‌ సహా మరికొందరు వారిని బెదిరించారని, జేసీబీతో భూమి కబ్జా చేయడానికి వచ్చారని తమకు ఫిర్యాదు చేశారన్నారు. వీరిపై మరో ఫిర్యాదు రావడంతో, మరో కేసు నమోదు చేసి, మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చినట్లుగా తెలిపారు. వీరిలో కన్నారావు పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

కన్నారావుపై 147, 148, 447, 427, 307, 436, 506, రెడ్‌విత్‌ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ కేసులో 9మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కన్నారావు విదేశాల్లో ఉన్నట్లు తెలుసుకుని లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే కేసులో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం రెండు సార్లు ప్రయత్నించగా కోర్టు తిరస్కరించింది. కాగా ఇవాళ అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండుకు తరలించనున్నట్లు తెలిపారు.

కేసీఆర్‌ అన్న కుమారుడు కన్నారావు అరెస్ట్‌

"తన భూమిని కబ్జా చేయడానికి యత్నించారని బండోజు శ్రీనివాస్ ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదైనా కూడా మళ్లీ కబ్జాకి యత్నించారని, గత నెల 3న మరో ఫిర్యాదు చేశారు. ఇందులో కల్వకుంట్ల కన్నారావు, జక్కిడి సురేందర్, జక్కిడి హరినాథ్‌, శివ, డానియెల్ సహా మరికొందరు నిందితులుగా ఉన్నట్లు గుర్తించాము. ఈకేసులో ఇప్పటివరకు 9మందిని అరెస్టు చేశాము. కన్నారావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము." - రాఘవేందర్ రెడ్డి, ఆదిభట్ల సీఐ

ఫోన్ టాపింగ్ కేసు - భుజంగరావు, తిరుపతన్నలకు ఈ నెల 6 వరకు రిమాండ్‌ - Telangana Phone Tapping Case Update

నాటి అధికార పార్టీ సుప్రీమ్‌ ఆదేశాల మేరకే- రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్డులో కీలక విషయాలు - phone tapping case updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.