Huge Crowd Gathering From Surrounding Districts for YCP Sabha: ఏలూరులో జగన్మోహన్ రెడ్డి సభకు తూర్పుగోదావరి జిల్లా నుంచి సైతం జన సమీకరణ చేశారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించి ఆ పాఠశాలలకు చెందిన బస్సులలో జనాన్ని తరలించారు. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి సభలు నిర్వహించినా, ఎక్కడ సభ నిర్వహిస్తున్నారో ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లేదా జిల్లా పరిధిలోనో సంబంధిత పార్టీ నాయకులు జన సమీకరణ చేసి తీసుకెళ్లడం సామాన్యంగా కనిపిస్తుంది. కాని వైసీపీ నాయకులు మాత్రం పక్క జిల్లాల నుంచి కూడా జనాల్ని తీసుకు వెళ్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు నాయకులు ఏలూరుతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర పరిసర జిల్లాల నుంచి జన సమీకరణ చేసి తీసుకెళ్లారు.
సీఎం జగన్ సభకు స్కూల్ బస్సులు - సెలవు ప్రకటించిన విద్యా సంస్థలు
ఇందుకోసం ఆయా జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను వ్యానులను సమీకరించి జనాన్ని తరలించారు. సభకు తగిన స్థాయిలో జనం వస్తారో రారో తెలియదనుకున్నారో ఏమో వేర్వేరు జిల్లాల నుంచి జన సమీకరణ చేయడం పట్ల ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఉన్న వ్యతిరేకత జనాల వల్ల వ్యక్తం అయ్యే అవకాశం ఉండడంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి సైతం జన సమీకరణ చేస్తున్నట్లు అన్నారు. ముఖ్యమంత్రి సభకు అన్ని జిల్లాల నుంచి జనాన్ని సమీకరించవలసిన అవసరం ఏమి వచ్చింది అంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు - ఈనాడు, ఈటీవీ రిపోర్టర్లపై దాడి
మొత్తంగా సీఎం జగన్ సభకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించిన 50 నియోజకవర్గాల నుంచి దాదాపు 3 లక్షల మంది ప్రజలను ఈ సిద్ధం సభకు తరలించేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన స్థలంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్దకు జనం వచ్చేందుగు అధికారులు ఏకంగా ఓ పంట కాలువను పూర్తిగా మాయం చేశారు. పంట వ్యర్థాలను కొల్లేరుకు తీసుకెళ్లే కాల్వను మూడుచోట్ల మట్టితో కప్పెట్టేశారు.
టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య భూవివాదం - ఏఎస్‌ఐపై వైసీపీ నేత దురుసు ప్రవర్తన
ఇప్పటికే ఉన్న కాల్వల్లో పూడిక తీయక ఇటీవల కురిసిన తుపాన్ దెబ్బకు నీరు బయటకు పోయే మార్గం లేక రైతులు ఎంతో నష్టపోయారు. ఇప్పుడు ఏకంగా ఉన్న కాల్వలనే పూడ్చివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2 వేల బస్సుల్లో జనాన్ని తరలించనున్నారు. ఈ బస్సులు పార్కింగ్ కోసం దగ్గర్లోని పంట పొలాలను తీసుకున్నారు. బస్సులు పొలాల్లోకి వెళ్లేందుకు వీలుగా పొలం గట్లు, కాలువ గట్లను సైతం యంత్రాలతో తవ్విపడేశారు. కాపుకు వచ్చిన పెసర పంటను సైతం ధ్వంసం చేశారు. రైతులకు పరిహారం ఇచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు ఈ విషయాన్ని రైతులు ఎవరూ ధృవీకరించడం లేదు.