ETV Bharat / politics

దివ్యాంగుల పింఛన్​ కావాలా - సదరం సర్టిఫికెట్​ ఎలా పొందాలంటే ? - SADAREM Slot Booking - SADAREM SLOT BOOKING

SADAREM Slot Booking: ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం దివ్యాంగుల పాలిట వరంలా మారింది. గతంలో 3వేల రూపాయలు ఉన్న పింఛన్​ ఇప్పుడు 6వేలకు చేరడంతోపాటు జూలై 1న అధికారులే స్వయంగా ఇంటికి వచ్చి అందించడం విశేషం. ఈ నేపథ్యంలో పింఛన్​కు అర్హుల ఎంపికలో కీలకమైన సదరం (వైకల్య నిర్ధారణ) సర్టిఫికెట్​ జారీ కోసం జులై 8 నుంచి స్లాట్లు అందుబాటులో ఉండనున్నాయి.

sadarem_certificate
sadarem_certificate (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 10:14 AM IST

SADAREM Slot Booking: దివ్యాంగుల పింఛన్​ రూ.6 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ఎన్డీఏ కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే అమలు చేసింది. తాజాగా జులై 1న సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్​ అందచేశారు. ఇదిలా ఉంటే దివ్యాంగుల పింఛన్​ ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపికలో సదరం సర్టిఫికెట్​ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు జులై 8 నుంచి స్లాట్లు అందుబాటులో ఉండనున్నాయి.

సదరం సర్టిఫికెట్: శారీరక వైకల్యం, మానసిక లోపాలు, కంటి చూపునకు సంబంధించి దృష్టి వైకల్యం ఇతర లోపాలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందించేదే సదరం సర్టిఫికెట్​. దీనిని ప్రైవేటు వ్యక్తులు, వైద్యులు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం అందిస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి ఆర్థో, అందత్వం, వినికిడి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తుంది.

Disabled Person Pension Problem : కాళ్లు విరిగాయి దేవుడా అంటే.. 'కరెంటు బిల్లు' అంటున్నారు.. వైకల్యం అతడికా.. ఈ ప్రభుత్వానికా..!

సదరం సర్టిఫికెట్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్​, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్, రాష్ట్ర, కేంద్ర రవాణా సంస్థలైన ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణ చార్జీల్లో రాయితీలు, చిన్న పరిశ్రమ స్థాపనకు రుణాలు, సబ్సిడీకి సదరం సర్టిఫికెట్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాంపులు నిర్వహిస్తూ ఎంతో మంది దివ్యాంగులకు ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ఇప్పటికీ వేలాది మంది దివ్యాంగులు ఈ సదరం సర్టిఫికెట్లు పొంది వివిధ మార్గాల్లో లబ్ధి పొందుతున్నారు.

వైకల్య ధ్రువీకరణ "సదరం" సర్టిఫికెట్​ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో జులై 8 నుంచి స్లాట్లు అందుబాటులో ఉండనున్నాయి. జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు సంబందించిన అడ్వాన్స్ స్లాట్ గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మీ సేవ కేంద్రాల్లో బుక్​ చేసుకునే వీలుంది. కొత్త AP SADAREM సర్టిఫికెట్ కోసం స్లాట్​ బుక్​ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ sadarem.ap.gov.inని సందర్శించాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, లింగం, వైవాహిక స్థితి, కులం, మతం సహా ఉన్నత స్థాయి విద్యార్హత, అలాగే మీ రేషన్ కార్డ్‌లోని నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.

వైఎస్సార్సీపీ పాలనలో అధికార పార్టీ నేతలు సదరం సర్టిఫికెట్లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పింఛన్​ కోసం వైకల్యం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు తీసుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది.

ఏపీ కేబినెట్​ కీలక నిర్ణయాలు - సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు ఆమోద ముద్ర - Andhra Pradesh Cabinet Meeting

మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆ ఐదు హామీల అమలుకు తొలిరోజే గ్రీన్​సిగ్నల్​ - CM Chandrababu Signs Five Files

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.