High Court Hearing on Petition Against Accepting Volunteers Resignations: ఎన్నికలు పూర్తయ్యే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించ కుండా ఉండేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని బీసీవై పార్టీ అధ్యక్షులు బీ. రామచంద్రయాదవ్ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటి వరకు 62 వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని ఎన్నికల కమిషన్ తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్లోపే అధికంగా రాజీనామాలు చేశారన్నారు. 900 మందిపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతూ ఆదేశాలు కూడా జారీ చేశామని ఈసీ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
నాడు ఉరి తీయాలన్నవాడే - నేడు తండ్రి అయ్యాడా?: వైఎస్ షర్మిల - YS Sharmila criticized CM Jagan
రాజీనామాలను ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని పిటీషనర్ న్యాయవాది ఉమేశ్ చంద్ర కోర్టుకు తెలిపారు. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలు ఉన్నాయని పిటీషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపేందుకు ఈసీ విస్తృత అధికారాలు వినియోగించవచ్చని పిటీషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది.
టీడీపీ నేతపై ఎస్సై దురుసు ప్రవర్తన - విచారణకు ఆదేశించిన ఎస్పీ - SI insulted TDP leader