ETV Bharat / politics

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్- ప్రతివారం పోలీస్ స్టేషన్​లో సంతకం పెట్టాలని షరతు - High Court Granted Bail to Pinnelli - HIGH COURT GRANTED BAIL TO PINNELLI

High Court Granted Bail to Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్​సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి కేసుల్లో పిన్నెల్లి బెయిల్ కోరగా ధర్మాసనం విచారణ జరిపి బెయిల్ మంజూరు చేసింది.

hc_granted_bail_to_pinnelli
hc_granted_bail_to_pinnelli (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 3:15 PM IST

Updated : Aug 23, 2024, 4:13 PM IST

High Court Granted Bail to Pinnelli Ramakrishna Reddy: వైఎస్సాసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. మే 13వ తేదీన పోలింగ్ రోజు పాల్వాయిగేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్​పై దాడి, ఆ తర్వాత రోజు కారంపూడిలో విధ్వంసాన్ని అడ్డుకునేందుకు యత్నించిన సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లికి బెయిల్ వచ్చింది. పాస్ పోర్టు అప్పగించాలని, ప్రతివారం పోలీస్ స్టేషన్​లో హాజరై సంతకం పెట్టాలని పిన్నెల్లికి హైకోర్టు షరతులు విధించింది. ఆయా కేసుల్లో ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

విధ్వంసానికి పాల్పడమేగాక, అడ్డుకోబోయిన సీఐపైనా దాడి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్ పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు, అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్‌పై దాడి చేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల మరో మహిళపైనా దాడికి యత్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత రోజు అనుచరులతో కలిసి కారంపూడిలో విధ్వంసానికి పాల్పడమేగాక, అడ్డుకోబోయిన సీఐపైనా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతోపాటు అనుచరులపైనా కేసులు నమోదయ్యాయి.

దస్త్రాలకే పరిమితమైన బుడమేరు వంతెన- ఇంకా మోక్షం ఎప్పుడో? - Bridge Construction works delay

టీడీపీ ఏజెంట్​పై హత్యాయత్నం, సీఐపై దాడి కేసులలో రిమాండ్: ఈ కేసుల్లో ఇన్నాళ్లు అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగా, ఇప్పటికీ మూడుసార్లు వాటిని పొడిగించారు. ఈ వెసులుబాటు గడువు ముగియడంతోపాటు ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పటిష్ఠ బందోబస్తు మధ్య మాచర్ల కోర్టుకు తరలించారు. ఇరువైపుల వాదనల విన్న న్యాయమూర్తి పాల్వాయిగేట్‌ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై హత్యాయత్నం కేసు, కారంపూడి సీఐపై దాడి కేసులో రిమాండ్ విధించారు. అంతే కాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసు వాహనంలో నుంచి కోర్టుకు తరలిస్తున్న తరుణంలో ఆయనకు ఎదురు నిలిచిన ఓ తెలుగుదేశం కార్యకర్తపై పిన్నెల్లి దాడి చేశారు.

జోగి రమేష్​కు ప్రశ్నలు - పొన్నవోలు సమాధానాలు: న్యాయవాది సిద్ధార్థ లూథ్రా - JOGI RAMESH BAIL PETITION HEARING

పెద్దిరెడ్డి భూదందాపై ప్రాథమిక రిపోర్ట్ - జేసీ నుంచి తహసీల్దార్ వరకు అక్రమాలు - Peddireddy Land Grabbing

Last Updated : Aug 23, 2024, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.