Betting in Gudivada : గుడివాడ గడ్డ బెట్టింగ్ అడ్డాగా మారింది. బెట్టింగ్ వ్యామోహంతో కుటుంబాలు చితికిపోతున్నాయి. గుడివాడ కేంద్రంగా ముఠాలు బెట్టింగ్ కడుతున్నాయి. ఎమ్మెల్యే కనుసన్నల్లో ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ బోర్డులకు ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు.నోరు విప్పితే బీప్, అవినీతికొస్తే బాప్ - దోపిడిల్లో 'నా' 'నీ' భేదాలుండవ్. ఇకనైనా పోలీసులు మేల్కొని, ఎమ్మెల్యే అనుచరుల బెట్టింగ్ బోర్డుల ఆగడాలు అరికట్టి, కుటుంబాలు చితికిపోకుండా కాపాడాలని గుడివాడ వాసులు కోరుతున్నారు.
కబ్జాల నుంచి కాల్‌మనీ వరకు, వడ్డీ వ్యాపారం మొదలుకుని క్యాసినోలు, గుట్కా, మట్కా ఇలా అన్నింటా ముందుండే ఆ ప్రజాప్రతినిధి అభివృద్ధి విషయంలో మాత్రం అందనంత దూరంలో ఉంటారు. ఎక్కడైనా గాడిదకు నల్లబెలూన్లు కడితే తననే అవమానించారని భుజాలు తడుముకునే మహాజ్ఞాని. ఆ నియోజకవర్గానికి ఉన్న కీర్తి ప్రతిష్టలను ఆ ఎమ్మెల్యే దిగజార్చారనేది ప్రజల అభిప్రాయం.
గుడివాడలో రోడ్డు కోసం మహిళల నిరసన - ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
కృష్ణా జిల్లాలో ఓ ప్రముఖ పట్టణ శివారున ఉన్న దాదాపు రూ.500 కోట్ల విలువైన 150 ఎకరాల ఇనాం భూములకే గాలం వేశారు. ఆ భూముల్ని కొంతమందికి ఇనాం ఇచ్చిన తర్వాత రైత్వారీ పట్టాలు ఇవ్వకపోవడంతో కాలక్రమంలో చేతులు మారి దేవాదాయ భూములుగా మారాయి. మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారితో కలిసి ఆక్రమణకు స్కెచ్ వేసి దేవదాయశాఖ భూములు కావని ఎన్‌వోసీ జారీ చేశారు. ఈ దస్త్రం దేవదాయ శాఖ కమిషనర్ దగ్గరకు వెళ్లినా క్లియరెన్స్ దొరక్కపోవడంతో ఆ వ్యవహారం పెండింగ్‌లో పడింది. అప్పటికే నాటి మంత్రికి కోట్లు ముట్టాయని గుసగుస. ఇప్పటికీ ఆ భూములు కబ్జాలోనే ఉండగా కంచెలు కూడా వేశారు. ఓ పట్టణ పరిధిలో వక్ఫ్ బోర్డు భూముల్లో కొంత భాగం భీమవరం వ్యాపారులు కొనుగోలు చేయడంతో తన అధికారాన్ని ఉపయోగించి కోట్లు గుంజారు. పట్టణానికి సమీపంలోని 8.64 ఎకరాల డీటీసీపీ లేఅవుట్‌ను ఆక్రమించేశారు.
గుడివాడలో వైసీపీ నేతలు చివరకు దేవుడి భూములనూ వదల్లేదు. పట్టణ నడిబొడ్డున బంటుమిల్లి రోడ్డులో వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆలయ ఆవరణలో కోట్ల విలువైన ఖాళీ స్థలం ఉంది. దీనిపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేందుకు నెల రోజులుగా చదును చేస్తున్నారు. స్థానికులు అడిగితే భక్తులకు అన్నదానం చేసేందుకేనని సమాధానమిస్తూ దాటవేశారు. రాత్రికిరాత్రే రేకుల షెడ్డు ఏర్పాటు చేసి సాయిబాబా విగ్రహం ప్రతిష్టించి తొలగించేందుకు యత్నించిన దేవదాయ శాఖ అధికారులను అడ్డుకున్నారు.
మరో వివాదంలో కొడాలి- మహిళలతో పాదపూజలు - Kodali Nani milk abhishekam video
నోరు విప్పితే బీప్, అవినీతికొస్తే బాప్ - దోపిడిల్లో 'నా' 'నీ' భేదాలుండవ్