Graduate MLC Election Campaign : వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ఉమ్మడి జిల్లాల పరిధిలో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. కాగా వీరితో పాటు మొత్తం 52 మంది బరిలో నిలిచారు.
తాజా జాబితా ప్రకారం వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటర్ల వివరాలు
- పురుషులు - 2,86,993
- మహళలు - 1,74,788
- ఇతరలు - 05
- మొత్తం ఓటర్లు - 4,61,786
- గతంతో పోల్చితే తగ్గిన ఓట్లు - 43,777
- గడిచిన ఎన్నికల్లో చెల్లని ఓట్లు - 21,636
MLC BY Election Schedule 2024 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికే ఓటు హక్కు ఉంటుంది. చదువుకున్న వారు అయినప్పటికీ గడిచిన ఎన్నికల్లో 21,636 ఓట్లు చెల్లలేదు. సాధారణ ఓటు హక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు ప్రాధాన్య క్రమంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటెయ్యాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇతర ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఒకే విధంగా ఉంటుందని నల్గొండ కలెక్టర్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన తెలిపారు.
"అభ్యర్థుల నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ అనంతరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది పోటీ చేస్తున్నారు. వారు ఇప్పటి నుంచి ప్రచారం చేసుకోవచ్చు. సాధారణ ఎన్నికలకు ఎలాంటి నియమాలు ఉన్నాయో అవే పాటించాల్సి ఉంటుంది. కారు ర్యాలీ, బైక్ ర్యాలీ, రోడ్ షో, బహిరంగ సభలు పెట్టుకోవాలంటే అనుమతి తీసుకోవాలి." - దాసరి హరిచందన, ఎమ్మెల్సీ ఎన్నికల ఆర్వో
Nalgonda Collector on MLC BY Election : ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీలో నిలిచిన అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారాన్ని నిర్వహించుకోవచ్చని ఆయా జిల్లాలలో ప్రచారం నిర్వహించుకుంటే సంబంధిత ఏఆర్వోల ద్వారా అనుమతులు తీసుకోవాలని ఆర్వో హరిచందన సూచించారు. అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందన్నారు. ప్రసంగాలలో రెచ్చగొట్టే సందేశాలు, కులం, మతం వంటివి లేకుండా చూసుకోవాలన్నారు. సీ- విజిల్ ద్వారా మద్యం, నగదు వంటివి ఎక్కడైనా పంపిణీ చేస్తున్నట్లయితే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల ఆర్వో హరిచందన తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి నామినేషన్ దాఖలు - Telangana Graduate MLC Elections
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి నామినేషన్ దాఖలు - Telangana Graduate MLC Elections