ETV Bharat / politics

రాజధానికి రూ. 15 వేల కోట్లు అప్పా? లేక గ్రాంటా? - నిర్మలా సీతారామన్‌ స్పష్టత - Budget 2024 for AP

Nirmala Sitharaman on Budget 2024 for AP: రాష్ట్రం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి తెలిపారు. పోలవరానికి ఎంత ఖర్చైనా, ఎలా తెచ్చినా కేంద్రానిదే బాధ్యతని, కేంద్రం అంగీకరించిన మేరకు అన్ని నిధులు అందించి తీరుతామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కేటాయింపులు అప్పా? లేక గ్రాంటా? అని సందేహాలు తలెత్తిన వేళ ఈ అంశంపై ఆమె స్పష్టతనిచ్చారు.

Nirmala Sitharaman Clarity on Budget 2024 for AP
Nirmala Sitharaman Clarity on Budget 2024 for AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 7:41 PM IST

Updated : Jul 23, 2024, 8:21 PM IST

Nirmala Sitharaman Clarity on Budget 2024 for AP : కేంద్రబడ్జెట్​లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రకటించిన రూ.15వేల కోట్ల ఆర్ధిక సాయంపై నెలకొన్న సందిగ్దతపై ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. ఈ రూ.15 వేల కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకుని, వివిధ ఏజెన్సీల ద్వారా అమరావతి నిర్మాణానికిి తోడ్పాటును అందిస్తామని ఆమె వెల్లడించారు. ఈ రుణాన్ని తిరిగి చెల్లించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని, అయితే, ప్రస్తుతం ఏపీ ఈ రుణాన్ని చెల్లించే పరిస్థితిలో లేదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో శుభవార్త చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు ప్రకటించారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్‌ పాల్లొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు.

రాష్ట్రానికి తోడ్పాటునిచ్చేలా కేంద్ర బడ్జెట్ - వెనకబడిన జిల్లాలకు బుందేల్​ఖండ్ తరహా ప్యాకేజీ: చంద్రబాబు - cbn comments on Budget

బడ్జెట్‌లో చెప్పిన రూ. 15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని, అలాగే వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కేంద్రం అంగీకరించిన మేరకు అన్ని నిధులు అందించి తీరుతామని తెలిపారు. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్ట్​ అని, అది కేంద్రం బాధ్యతని తెలిపారు. పోలవరానికి ఎంత ఖర్చయినా.. ఎలా తెచ్చినా కేంద్రానిదే బాధ్యతని అన్నారు. పోలవరం పూర్తికి ఎంత అవసరమో, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్రాజెక్టు పూర్తికి మద్దతిస్తామని తెలిపారు.

ఏపీకి నిర్మలమ్మ వరాలు - అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు - 15 thousand Crores for Amaravati

వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి కూడా కేంద్రం ప్రత్యేక సహకారం ఉంటుందన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు బడ్జెట్‌లో కేటాయించారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల్లో నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ప్రత్యేకంగా విడుదల చేయనునట్లు తెలిపారు.

విభజన చట్టం ప్రకారం వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఉంటుందన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆర్ధికమంత్రి స్పష్టం చేశారు.

అమరావతికి కేంద్ర సాయం - ఆంధ్రప్రదేశ్​ నేతల హర్షం - tdp leaders on union budget 2024

Last Updated : Jul 23, 2024, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.