Errabelli Dayakar Rao On Phone Tapping Case : ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కేసులో తనును కూడా ఇరికించి జైలుకు పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. జైలుకు పోయినా పార్టీని మాత్రం మారనని ఆయన స్పష్టం చేశారు. గతంలో రైతుల కోసం అనేక సార్లు జైలుకుపోయానని చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన రైతుదీక్షలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు : ఎర్రబెల్లి దయాకర్
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను హామీల అమలు గురించి అడిగితే కేసులతో భయపెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని ఆలోచన చేస్తున్నామని మంత్రి తెలిపారు.
" ఫోన్‌ట్యాపింగ్ కేసులో నన్ను ఇరికించి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. జైలుకు పోతే పోతా కానీ పార్టీ మాత్రం మారను. గతంలో రైతుల కోసం మూడు సార్లు జైలుకు పోయా దెబ్బలుతిన్నా"- ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ నేత
Erraballi Fires On kadiyam Srihari : పదవుల కోసం పార్టీలు మారి, నాలుగు సార్లు చిత్తుగా ఓడిన కడియం శ్రీహరి నామీద విమర్శలు చేస్తున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. ఎన్నికల్లో కడియం కావ్య చిత్తుగా ఓడిపోతుందని ఇది తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని ఎర్రబెల్లి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చే ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు.
Errabelli Dayakar Comments On phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని, ఆ కేసులో నిందితుడైన దుగ్యాల ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రణీత్ రావు బంధువులు తమ గ్రామంలో ఉన్నారన్న ఆయన వారికి ఏ పార్టీతో సంబంధం ఉందో తనకు తెలియదని, విచారణ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అని వ్యాఖ్యానించారు. దయాకర్ రావు తనకు తెలియదని ప్రణీత్ రావు స్టేట్మెంట్ను ఇచ్చారన్న ఎర్రబెల్లి, పార్టీ మారాలంటూ కొందరు తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు.
ప్రజల కోసమే పోరాటాలు చేశా ఎక్కడా పొరపాట్లు చేయలేదు : తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాడానన్న దయాకర్ రావు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనపై ఎలాంటి మచ్చ లేదని అన్నారు. తనను ఇరికించాలని ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని తెలిపారు. ప్రజల కోసం పోరాటాలు చేశాను తప్ప ఎక్కడా పొరపాట్లు చేయలేదని తెలిపారు. ఇబ్బంది పెట్టేందుకే తనపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని ఆక్షేపించారు.
మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నీ వల్లే జైలుకు వెళ్లా - నీ చరిత్ర నాకు తెలీదా : రేవంత్ వర్సెస్ ఎర్రబెల్లి
'రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం.. కాంగ్రెస్, బీజేపీ పెట్టాబేడా సర్దుకోవాల్సిందే'