Telangana Employees Not Interested in Election Duties : ఇంకో 14 రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు కానీ కొందరు ఉద్యోగులు మాత్రం ఎన్నికల విధులకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకు రకరకాల కారణాలు చెప్పి మినహాయింపు కోరుకుంటున్నారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాలు తాము ఉండే ప్రాంతాలకు దూరంగా ఉన్నాయని మహిళలు, ఎండలు ఎక్కువగా ఉన్నాయని కొంత మంది ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా తప్పుకుంటున్నారు.
ఎన్నికల విధులకు హాజరు కాలేమని నిత్యం సుమారు వంద నుంచి 200 మంది ఉద్యోగులు ఎన్నికల అధికారులకు లేఖలు రాస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం చుట్టూ చాలా మంది చక్కర్లు కొడుతున్నారు. ఇదేంటని కొందరు అధికారులను ఆరా తీస్తే ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు. ఈ పరిణామాలు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్, రిటర్నింగ్ అధికారులు అనుదీప్ దురిశెట్టి, హేమంత్ పాటిల్, సిబ్బంది విభాగం నోడల్ అధికారి ఉపేందర్రెడ్డిలో ఆందోళనకు తావిస్తున్నాయి. మే 13 వరకు ఇంకెంత మంది మినహాయింపు కోరతారనే దానిపై సందిగ్ధత నెలకొంది.
ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి : డీజీపీ రవిగుప్తా
సరిపడా సిబ్బంది ఉన్నప్పటికీ : ప్రతి 16 మంది అభ్యర్థులకు ఓ బ్యాలెట్ యూనిట్ అవసరమైనందున, ఒక్కో బ్యాలెట్ యూనిట్‌ను మోసేందుకు ఒక్కో సిబ్బందిని నియమించుకోవాలి. ఈ లెక్కన చూస్తే హైదరాబాద్ జిల్లాలోని 3,986 పోలింగ్ కేంద్రాలకు 16 వేల మంది ఉద్యోగులు, 10 వేల మంది సిబ్బంది కావాలని అంచనా. అలాగే మరో 20 శాతం మందిని రిజర్వులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 20 శాతం రిజర్వు సిబ్బందితో కలిపి ఉద్యోగులు, సిబ్బంది జిల్లా ఎన్నికల అధికారి వద్ద సిద్ధంగా ఉన్నారు. వారిని అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపించారు. అయినప్పటికీ ఉద్యోగులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. వీరి విన్నపాలతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులు చెప్పే కారణాలు : మే నెలలో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల విధులు హాజరు కాలేమంటున్నారు. కొందరు మహిళా ఉద్యోగులు వారికి కేటాయించిన కేంద్రాలు దూరంగా ఉన్నాయని చెబుతున్నారు. ముందురోజు రాత్రి పోలింగ్ కేంద్రంలో నిద్రించడం కష్టమని, సదుపాయాలు లేవని మినహాయింపు కోరుతున్నారు. మరోవైపు పని ఒత్తిడితో కూడా విధులు దూరంగా ఉంటున్నామని తెలుపుతున్నారు. కుటుంబంతో గడపాలని ఉద్యోగులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో పెరిగిన పొలిటికల్ హీట్ - నువ్వానేనా అన్నట్లు తలపడుతున్న పార్టీలు
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు - లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై వికాస్ రాజ్