Prashant Kishore's comments led to a heated debate in AP politics : ఎన్నికల వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నేతల చూపంతా ఆయన వైపే. మీడియా దృష్టి ఆయనపైనే. ఆయన ఎవరి పక్షం ఉంటారో విజయం వారిదే. ఇప్పటికే జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. ఆయన్ను నమ్మిన వారంతా గెలుపు బాటలో పయనించారు. ప్రభుత్వాల్లో కొలువుదీరి పాలనా పగ్గాలు అందుకున్నారు. మొత్తంగా ఆయన చెప్పిందే వేదం అని ఒక్క మాటలో చెప్పొచ్చు. ఎన్నికలపై కనీస అవగాహన ఉన్నోళ్లకి కొత్తగా పరిచయం అక్కర్లేని వ్యక్తి ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore). షార్ట్‌కట్‌గా పీకే అంటుంటారు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పీకే వ్యాఖ్యలు వైఎస్సార్సీపీలో కలకలం రేపుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో జగన్ ఏమి చేసినా గెలవడు - ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల వ్యూహకర్త పీకే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉలిక్కిపాటుకు గురిచేయగా.. నాయకులు, శ్రేణుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యేల స్థాన చలనం, మరోవైపు అభ్యర్థుల మార్పిడి, ఇంకో వైపు ఎంపీలు, ఎమ్మెల్యేల వలసలు.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ(YSRCP) విజయావకాశాలు సన్నగిల్లుతుండగా తాజాగా ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు ఆ పార్టీ కొంపముంచుతున్నాయి.
బలహీనవర్గాలకు టీడీపీ ప్రాధాన్యం - తొలి జాబితాలోనే 20 మంది ఎస్సీలకు చోటు
హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని, ఓటమి తప్పదని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో టీడీపీ - జనసేన (TDP-Jansena)కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. పీకే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే అభ్యర్థుల మార్పిడితో తల పట్టుకుంటున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం, పార్టీ కార్యకర్తలకు ఈ విషయం శరాఘాతంలా మారింది. కొద్ది రోజుల కిందట ప్రకటించిన జాబితాలోనూ మార్పులు చోటుచేసుకున్న క్రమంలో ఇప్పటికే టిక్కెట్ దక్కించుకున్న నాయకులు సైతం చివరి వరకు పోటీలో ఉంటారో లేదో అనే పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల
టీడీపీ-జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో అధికార పార్టీ అభ్యర్థులు పోటీకి వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఓటమి ఖాయమనే భయంతో చాలా మంది నేతలు పోటీకి వెనకడుగేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా జరుగుతున్న జగన్ సభలకు జనం మొఖం చాటేస్తుండడం అధికార పార్టీపై వ్యతిరేకతకు అద్దం పడుతోంది.
టీడీపీ-జనసేన కూటమి ఫిబ్రవరి 24న మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పలు మార్లు సర్వేలు నిర్వహించిన ఆ పార్టీలు 99స్థానాల్లో గెలుపు గుర్రాలను తొలిజాబితాలోనే బరిలో దింపాయి. జనసేన పార్టీకి మొత్తం 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించగా తొలి జాబితా(First List)లో తెలుగుదేశం పార్టీ తరఫున 94మంది, జనసేన నుంచి ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇప్పటికే ఆయా అభ్యర్థులంతా ప్రచారంలో ముందున్నారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్ గ్యారంటీ అనే నినాదంతో ఇంటింటికీ వెళ్లి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి ? - చంద్రబాబు భావోద్వేగ ట్వీట్