ETV Bharat / politics

తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ ప్రచార భేరీ - ఏప్రిల్‌ మొదటి వారంలో భారీ బహిరంగ సభ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Congress Plans to Public Meeting in Tukkuguda : వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా రాహుల్‌ గాంధీ పాల్గొనే సభ కావడంతో భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హస్తం వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్వహించిన సెంటిమెంట్‌తో హైదరాబాద్‌ శివారులోని తుక్కుగూడలో ఏర్పాటు చేస్తున్నమొట్టమొదటి సభగా పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీ జాతీయస్థాయి మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేయనున్నారు.

Telangana Lok Sabha Election 2024
Congress Public Meeting In Tukkuguda
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 24, 2024, 7:36 AM IST

Updated : Mar 24, 2024, 8:32 AM IST

ఏప్రిల్‌ తొలి వారంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ

Congress Plans to Public Meeting in Tukkuguda : లోక్​సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ భారీ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రెండంకెల స్థానాలు దక్కించుకోడానికి పక్కా వ్యూహంతో కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి పీసీసీ అధ్యక్షుడైన సీఎం రేవంత్​రెడ్డి పూర్తిగా పార్టీ కార్యకలాపాలకే సమయాన్ని కేటాయిస్తున్నారు. ముఖ్య నాయకులతో సమావేశమవడం, నియోజకవర్గాల వారీగా తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీయడం, ఏవిధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై వ్యూహరచన చేస్తున్నారు.

Congress Focus on Lok Sabha Elections 2024 : ఇప్పటివరకు ప్రకటించిన తొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల బలాబలాలపై ఆరా తీయడం, అక్కడ ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే వారి గురించి కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పట్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అడ్డంకులు అధిగమిస్తూ - వ్యూహాలకు పదును పెడుతూ - గెలుపు దిశగా కాంగ్రెస్ కార్యాచరణ - T Congress Lok Sabha Election Plan

తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ : నియోజకవర్గాల వారీగా, బూత్‌ల వారీగా కమిటీల ఏర్పాటు చేయాలని ఆయా డీసీసీ అధ్యక్షులను రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఏఏ అంశాలను జనంలోకి తీసుకెళ్లాలన్న అంశంపైనా ఆయన సీనియర్‌ నేతలతో చర్చించి కసరత్తు చేస్తున్నారు. కలిసొచ్చిన తుక్కుగూడలో వచ్చే నెల మొదటి వారంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల ముందు తరహాలోనే తుక్కుగూడ వేదికగా మరోసారి సభ నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ సభకు కాంగ్రెస్‌ (Telangana Congress)అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్టీ అగ్రనాయకుల పర్యటనల సమయం ఖరారయ్యాక సభ నిర్వహణ తేదీ ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Lok Sabha Election 2024 : మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు ముందుకేస్తోంది. ఇప్పటికే మొదటి దశలో నాలుగు, రెండో విడతలో మరో ఐదుగురికి టికెట్లు ప్రకటించింది. మొత్తం 17 స్థానాలకు కనీసం 14 స్థానాలైన చేజిక్కించుకోవాలని చూస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడంతో హస్తం పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతిపక్షాల ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. బలమైన నాయకత్వం లేని చోట పార్టీని బలోపేతం చేసే దిశలో ఏఐసీసీ అనుమతితో పక్కా కార్యాచరణను అమలు చేస్తోంది.

మోదీపై పోటీ చేసేది ఈయనే- 46మందితో కాంగ్రెస్​ నాలుగో జాబితా రిలీజ్​ - Lok Sabha Elections Congress List

ప్రచారం ముగిసేలోగా డీకే అరుణ బండారం బయటపెడతా : వంశీచంద్‌ రెడ్డి - Vamshi Chand Fire on DK Aruna

Last Updated : Mar 24, 2024, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.