ETV Bharat / politics

హరీశ్​రావు రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలి - రూ.2 లక్షల రుణమాఫీ పక్కా : కాంగ్రెస్ నేతలు - Congress On Harish Rao Challenge - CONGRESS ON HARISH RAO CHALLENGE

Congress Celebration on Rythu Runa Mafi : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజుకున్న రాజకీయనేతల రాజీనామాల తంతు మళ్లీ తెరపైకి వచ్చింది. శుక్రవారం జరిగిన రాష్ట్ర కేబినెట్​ సమావేశం ప్రధానంగా రూ.2 లక్షల రుణమాఫీ సాగగా, ఏక కాలంలోనే మాఫీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో నాడు బీఆర్​ఎస్ సీనియర్​ నేత హరీశ్​రావు విసిరిన సవాల్​ సంగతేంటని, రాజీనామాకు సిద్ధమా అంటూ హస్తం నేతలు స్పందిస్తున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీపై తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Congress Celebration on Rythu Runa Mafi
Congress Leaders Comments on Harish Rao Challenge (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 22, 2024, 5:11 PM IST

Congress Leaders Comments on Harish Rao Challenge : సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామనటం హర్షించదగ్గ విషయమని, గతంలో ఎద్దేవా చేసిన హరీశ్​రావు, కేటీఆర్‌ రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్ చేశారు. జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన వారు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతగా ఆదివారం నుంచి జిల్లా వ్యాప్తంగా కృతజ్ఞతా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం 65 సీట్లతో సుస్థిరంగా ఉందని, ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం లేదని జీవన్​రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే పార్టీలో చేరుతున్న వారు వారి వ్యక్తిగత విషయమన్నారు. రైతులకు ఉచితంగా పంటల బీమా చెల్లించటం, సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌, రైతు భరోసా కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేవని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని కొనియాడారు.

Congress Celebration on Rythu Runa Mafi : రాష్ట్రంలో ఏకకాలంలో రూ.2లక్షల రైతు రుణమాఫీకి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దఎత్తున కాంగ్రెస్​ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మండల, నియోజక వర్గ, జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు పెట్టి కాంగ్రెస్‌ ఇచ్చిన మాట మీద నిలబడుతుందని వెల్లడించాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్​ కుమార్‌ గౌడ్‌ సూచించారు. ఈ రుణమాఫీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

కాంగ్రెస్‌ పార్టీ సాధించిన ఇంతటి ఘనతను ప్రజల పక్షాన, రైతుల పక్షాన పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రైతులకు మోసం చేసిందని ఆరోపించారు. మరోవైపు రైతు రుణమాఫీపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్ష వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. దాదాపు రూ.31 వేల కోట్లతో రైతు రుణమాఫీని ఏకకాలంలో చెయ్యడం ప్రభుత్వ గొప్ప నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు రుణమాఫీ చేస్తామని చేయకుండా, రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు చేస్తారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంటే గులాబీ, కమలం పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీతోనే సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

హరీశ్​రావు రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉండాలి : మరోవైపు మాజీ మంత్రి హరీశ్​రావు రూ.2లక్షల రైతు రుణమాఫీ సవాల్‌కు కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆయన తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. శుక్రవారం జరిగిన కేబినెట్‌ ఆగస్టు 15లోపు ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తామని నిర్ణయించిందని, మాట ఇస్తే నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీగా పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో కాంగ్రెస్ నేత వాకిటి శ్రీహరితో కలిసి కవ్వంపల్లి మాట్లాడారు.

వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో చెప్పినట్లుగా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి రైతుల పక్షాన తరపున ధన్యవాదాలు తెలిపిన ఆయన, తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీదని, రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్‌ రెడ్డిదిగా వివరించారు.

ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ - ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు : మంత్రి పొంగులేటి - Minister Ponguleti khammam Tour

వచ్చే నెల నుంచి దశల వారీగా రూ.2 లక్షల రుణమాఫీ! - 5 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా! - tg govt focus Farmer loan waiver

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.