ETV Bharat / politics

తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్‌ - మిగతా 16 స్థానాల్లో పోటీ చేసేది ఎవరనే అంశంపై ఉత్కంఠ - Congress Exercise on MP Candidates

Congress Exercise on MP candidates : మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్యర్థిగా చల్లా వంశీచంద్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో మిగతా 16 స్థానాల్లో పోటీ చేసేది ఎవరనే అంశం కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతోంది. ఎంపీ టికెట్ల కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. దరఖాస్తు చేసుకున్నవారే కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన నేతలూ అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించేలా అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది.

Congress Focus for MP Candidates
Congress on Candidates For MP Elections in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 7:20 AM IST

Updated : Feb 22, 2024, 7:26 AM IST

తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి - మిగతా 16 స్థానాల ఎంపికపై కాంగ్రెస్​ కసరత్తు

Congress Exercise on MP candidates : రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బీజేపీ-బీఆర్​ఎస్​ దీటుగా అభ్యర్థుల్ని నిలిపి కనీసం 14 స్థానాలను చేజిక్కించుకునే దిశలో రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్తోంది. నారాయణపేట జిల్లా కోస్గీ వేదికగా జరిగిన బహిరంగ సభలో హస్తం పార్టీ తొలి లోక్‌సభ అభ్యర్థిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ నుంచి చల్లా వంశీచంద్‌ను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక మిగతా 16 స్థానాలకు బలమైన అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.

Congress Focus on Parliament Election 2024 : ఇప్పటికే టికెట్ల ఆశిస్తూ 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. బలమైన నేతలు లేని చోటా ఇతర పార్టీల నుంచి పార్టీలోకి వచ్చే వారికి ప్రాధాన్యం కల్పించాలని యోచిస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుస్తారని భావించిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ రాజ్యసభకు ఎంపిక కావడంతో అక్కడ నుంచి బలమైన నాయకుడిని బరిలో దించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన జీహెచ్​ఎంసీ(GHMC) మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, విద్యా స్రవంతి, చార్టెడ్‌ అకౌంటెంట్‌ వేణుగోపాల్‌ స్వామి సికింద్రాబాద్‌ నుంచి పోటీకి చొరవ చూపుతున్నారు.

లోక్​సభ బరిలో కొత్త అభ్యర్థులు - మల్కాజిగిరి స్థానం నుంచి బడా వ్యాపారవేత్త!

Congress Focus for MP Candidates 2024 : చేవెళ్ల నుంచి బరిలో దిగేందుకు బలమైన నాయకులు లేకపోవడంతో వికారాబాద్‌ జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్‌రెడ్డిని రాష్ట్ర నాయకత్వం పార్టీలోకి చేర్చుకుంది. గతంలో రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు హరివర్ధన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నప్పటికీ అంతకంటే బలమైన నేతను బరిలో దించాలన్న యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ నుంచి జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, కోమటిరెడ్డి(Komatireddy) కుటుంబ సభ్యులు టికెట్ ఆశిస్తున్నారు.

భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి టికెట్‌ ఆశిస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సతీమణి లక్ష్మి, సూర్యపవన్‌ రెడ్డి కూడా చొరవ చూపుతున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి, భట్టి(Bhatti Vikramarka), తుమ్మల కుటుంబాల నుంచి టికెట్లు ఆశిస్తున్నందున ఎవరిని అదృష్టం వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. నియోజకవర్గాల వారీగా టికెట్ల కోసం తీవ్ర పోటీ ఉన్నప్పటికీ బీజేపీ-బీఆర్​ఎస్(BRS)​కు దీటుగా బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది.

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ ఉద్దేశం: సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్​ పార్టీకి తలనొప్పిగా మారిన ఇంఛార్జ్​లు - ముడుపులు తీసుకొని పదవులు ఇస్తున్నారనే ఆరోపణ

Last Updated : Feb 22, 2024, 7:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.