Congratulations to Chandrababu : ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించడంపై చంద్రబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయం సాధించినందుకు స్టాలిన్ అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ప్రగతిపథంలో పయనించాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని స్టాలిన్ కోరారు.
Chiranjeevi Wishes to CBN: చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి శుభాకంక్షలు తెలియజేశారు. చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న చంద్రబాబుకి అభినందనలు తెలిపారు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం అని కొనియాడారు. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నానానని అన్నారు.
కొనసాగుతున్న కూటమి జైత్రయాత్ర - వైఎస్సార్సీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమా? - TDP clean sweep