CM Revanth Reddy Strong Warning to BRS : హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడే వారికి నగర బహిష్కరణ తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మెట్రో విస్తరణకు (Metro Expansion) పునాది రాయి వేస్తే, కాళ్లలో కట్టె పెట్టేలా అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాంటి వాళ్లకు నగర బహిష్కరణ తప్పదని ఘాటుగా హెచ్చరించారు.
CM Revanth Inaugurate Bairamalguda Flyover : ఎల్బీనగర్ నియోజకవర్గంలో 194 కోట్ల రూపాయలతో నిర్మించిన బైరామల్ గూడపై వంతెనను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , స్థానిక ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణిదేవి, జీహెచ్ఎంసీ(GHMC) మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రాస్‌లతో కలిసి ప్రారంభించారు. దీంతో సాగర్ రింగ్ రోడ్డు కూడలిలో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తొలగనున్నాయి. అనంతరం స్థానికులను ఉద్దేశిస్తూ ప్రసగించిన రేవంత్ రెడ్డి, ఎల్బీనగర్‌కు ఎప్పుడొచ్చినా తన గుండె వేగం పెరుగుతుందన్నారు.
హైదరాబాద్‌లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్ - నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన
"మేము ఒకపక్క పునాది రాయి వేసేటప్పుడు, కేంద్ర ప్రభుత్వం మీకు అనుమతి ఇస్తున్నామంటూ లేఖ పంపింది. అభివృద్ధి కోసం సంతోషంగా శంకుస్థాపన చేస్తుంటే ఒకాయన దిల్లీ వెళ్లి మరీ, ప్రాజెక్ట్ ఆపమని కోరుతూ కేంద్రానికి చెబుతున్నారు. మీకు చేయాటానికి చేతకాకపోతే, మేము చేసేటప్పుడు కనీసం కాళ్లలో కట్టెపెట్టకుండా ఉండాలని కోరుతున్నాను. హైద్రాబాద్‌లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్నవారికి, నగర బహిష్కరణ తప్పదని ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిస్తున్నాను."-రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
Congress Govt on Hyderabad Development : ఎమ్మెల్యేగా కొడంగల్‌లో ఓడిపోయినా, మల్కాజిగిరి ఎంపీగా(Parliament Seat) ఇక్కడి ఓటర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజా గొంతుకను చేశారని గుర్తుచేశారు. అనాడు నాటిన మొక్క ఎదిగి సీఎంగా మీముందుకు వచ్చిందంటూ ప్రజలను ఉత్సాహ పరిచిన రేవంత్ రెడ్డి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
మూసీ నది అభివృద్ధితోపాటు 2050 నాటికి వైబ్రాంట్ తెలంగాణ ప్రణాళిక సిద్దం అవుతుందన్నారు. త్వరలోనే టెండర్లు(Project Tenders) పిలిచి ప్రణాళికలను ఆమోదించి ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. ఇక ఇదే వేదికలో ప్రసగించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజకవర్గ సమస్యలను వివరించేందుకు ప్రత్యేకంగా కలిసేలా సమయం ఇవ్వాలని కోరారు.
కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించాం : డిప్యూటీ సీఎం భట్టి
మజ్లిస్, కాంగ్రెస్ మధ్య సయోధ్య - చేతిలోన చెయ్యేసి సర్కార్‌కు ఒవైసీ భరోసా!