ETV Bharat / politics

దశాబ్ధి ఉత్సవాలకు వచ్చేందుకు సోనియా గాంధీ సూత్రప్రాయంగా అంగీకరించారు : రేవంత్​ రెడ్డి - CM Revanth Reddy met Sonia Gandhi

author img

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 4:53 PM IST

Updated : May 28, 2024, 7:05 PM IST

CM Revanth Reddy's Meeting with Sonia Gandhi : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు గొప్ప పండుగ రోజు అని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున సోనియా గాంధీని వేడుకలకు ఆహ్వానించామని, ఉత్సవాలకు వచ్చేందుకు ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. ​

CM Revanth Reddy
CM Revanth Reddy's Meeting with Sonia Gandhi (ETV Bharat)
దశాబ్ధి ఉత్సవాలకు వచ్చేందుకు సోనియా గాంధీ సూత్రప్రాయంగా అంగీకరించారు : రేవంత్​ రెడ్డి (ETV Bharat)

CM Revanth Reddy Met Sonia Gandhi : దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. జూన్​ 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ ప్రజల తరఫున సోనియా గాంధీని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. దశాబ్ధి ఉత్సవాలకు వచ్చేందుకు సోనియా గాంధీ సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు గొప్ప పండుగ రోజు అని రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీకి పాకిస్థాన్ గుర్తొస్తుందని, పాకిస్థాన్ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు ఎవరు వెళ్లారని ప్రశ్నించారు. మోదీ ఇష్టం మేరకు వెళ్లి పాక్ ప్రధానిని కౌగిలించుకున్నారని వ్యాఖ్యానించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయడం, రాజ్యాంగాన్ని మార్చడం అంశాలను లేవనెత్తితే, బీజేపీకి పాకిస్థాన్ గుర్తొస్తుందన్నారు. ఈ క్రమంలోనే 10 ఏళ్ల దేశ పురోగతి ప్రోగ్రెస్ కార్డును భారతీయ జనతా పార్టీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు - తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా సీఎం సూచనలు - CM Revanth Discuss on State Logo

పదేళ్ల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. దేశ ప్రధాని, ప్రధాని కుర్చీని కాంగ్రెస్ ఎప్పుడూ అగౌరవ పరచలేదని తెలిపారు. డిపాజిట్లు కూడా రానిచోట మెజారిటీ సీట్లు వస్తాయని బీజేపీ బీరాలు పలుకుతుందన్న మోదీ, గ్యారెంటీ యొక్క వారంటీ ఖతం అయ్యిందని ఎద్దేవా చేశారు. బీజేపీ మాటలు వినేందుకు దేశ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు గొప్ప పండుగ రోజు. రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ ప్రజల తరఫున సోనియా గాంధీని ఆహ్వానించాను. జూన్‌ 2న వేడుకలకు వచ్చేందుకు సోనియా గాంధీ సూత్రప్రాయంగా అంగీకరించారు. మోదీ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీకి పాకిస్థాన్​ గుర్తుకొస్తుంది. 10 ఏళ్ల దేశ పురోగతిపై ప్రోగ్రెస్ కార్డును బీజేపీ విడుదల చేయాలి. ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. భారతీయ జనతా పార్టీని గద్దె దించాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారు. - సీఎం రేవంత్‌ రెడ్డి

రాష్ట్రంలో ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం అలా బయటపడింది : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth Reddy Chit Chat

Last Updated : May 28, 2024, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.