ETV Bharat / politics

కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు - తెలంగాణ ప్రజల నమ్మకం : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth Fire On KCR

CM Revanth Power Point Presentation on Kaleshwaram Project : కాళేశ్వరంలో జరిగిన అవినీతి బయపడుతుందనే, శాసనసభలో చర్చకు కేసీఆర్‌ రావటంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కుంగింది మేడిగడ్డ పిల్లర్లు కాదని, 4 కోట్ల ప్రజల ఆశలని పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పర్యటనలో భాగంగా బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ, మండలి సభ్యులు పరిశీలించారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రాజెక్టు వైఫల్యాలను ప్రజలకు వివరించిన ముఖ్యమంత్రి మేడిగడ్డపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

CM Revanth Reddy Comments on BJP
CM Revanth Power Point Presentation on Kaleshwaram Project
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 9:27 PM IST

CM Revanth Power Point Presentation on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం పరిశీలించింది. దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను పరిశీలించిన అనంతరం, ప్రాజెక్టు పగుళ్ల, నీటి లీకేజీల గురించి సీఎం అధికారులనడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) వద్దే, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆనకట్ట కుంగుబాటు గురించి వివరించారు.

రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు నీరు అందలేదు : సీఎం రేవంత్ రెడ్డి

ఇన్​ఛార్జి చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌ రెడ్డి, ప్రాజెక్టు నిర్మాణం తీరు, ఖర్చు, ఇతర వివరాలను సమగ్రంగా ముఖ్యమంత్రి, మంత్రులకు వివరించారు. అనంతరం, విజిలెన్స్‌ అధికారి రాజీవ్‌ రతన్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌(PowerPoint presentation) ఇచ్చారు. మేడిగడ్డ కుంగుబాటు అనంతరం, కాంగ్రెస్‌ సర్కార్‌ విజిలెన్స్‌ విభాగం విచారణలో గుర్తించిన అంశాలు, లోపాలను వారు వివరించారు.

CM Revanth Fire On KCR : కాళేశ్వరం ప్రాజెక్టును పొరుగు రాష్ట్రాల సీఎంలను తీసుకువచ్చి చూపించిన కేసీఆర్‌, ఇవాళ తన ఎమ్మెల్యేలకు ఎందుకు చూపించటంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలై పోయిందన్న ఆయన, తన అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ అవినీతిని బీజేపీ సమర్థిస్తుందా అని సీఎం ప్రశ్నించారు.

"మేడిగడ్డ ప్రాజెక్టు దాదాపు 1.5 మీటర్ల లోతుకు కుంగిపోయింది. ఇది సాంకేతిక నిపుణులు చెబుతున్న మాట. కళ్లకు కట్టినట్లుగా పగుళ్లు కనిపిస్తున్నాయి. వీటన్నింటిని కప్పిపుచ్చుకోవటానికి కేసీఆర్​ చేస్తోన్న ప్రయత్నాలు, ఈరోజు తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది. సంస్థ నిర్మాణం పూర్తికాకుండానే సర్టిఫికేట్​ ఇచ్చిన అధికారులను శిక్షించాలా లేదా? మీ వైఖరి ఏమిటి? బీజేపీ కూడా కేసీఆర్ అవినీతిని కాపాడటానికి ప్రయత్నం చేస్తారా లేకుంటే అవినీతిని నిలదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను."-రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి

కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు - తెలంగాణ ప్రజల నమ్మకం : సీఎం రేవంత్​ రెడ్డి

4 ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ సందర్శనకు బయల్దేరిన సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రజాప్రతిధులు

కుంగిన మేడిగడ్డను ఎవరూ చూడకుండా కేసీఆర్‌ కప్పిపుచ్చారని రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు. రీడిజైన్‌ పేరుతో కాళేశ్వరం చేపట్టి భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తన బండారం బయటపడుతుందని కేసీఆర్‌ గ్రహించే, అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు నల్గొండలో సభ పెట్టారని ఎద్దేవా చేశారు. చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్‌(KCR) పదే పదే అంటున్నారని, అలా అని భావించే ప్రజలు సైతం రెండుసార్లు అవకాశం ఇచ్చారన్నారు.

ప్రజలు రెండుసార్లు అవకాశం ఇస్తే, ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని రేవంత్ ఆరోపించారు. రూ.వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కుంగితే చిన్న విషయంగా మాట్లాడుతున్నారని, కుంగింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదని తెలంగాణ ప్రజల నమ్మకమని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. మేడిగడ్డపై సీబీఐ కంటే ఉన్నతమైన విచారణ కోరామని తెలిపారు.

CM Revanth Reddy Comments on BJP : సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని తాము భావిస్తుంటే, సీబీఐ విచారణ జరిపించి కేసీఆర్‌ను రక్షించాలని కమలదళం చూస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాలపై బీజేపీ నేతలకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వరంగల్‌కు వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(BJP Chief Kishan Reddy) ఇక్కడికి ఎందుకు రాలేదన్నారు. సాంకేతిక నిపుణులతో చర్చించాకే మేడిగడ్డ పునర్నిర్మాణంపై తమ నిర్ణయం చెప్తామన్నారు. అక్రమాలకు బాధ్యులపై విచారణ కొనసాగుతోందని, అవసరమైతే రెవెన్యూ యాక్టుతో సొమ్ము రికవరీ చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

రాజకీయ లబ్ధి కోసమే మేడిగడ్డ పర్యటన, బహిరంగ సభలు : కిషన్​రెడ్డి

'మేడిగడ్డ పర్యటనతో కేసీఆర్ పాలనలో విధ్వంసమైన జలదృశ్యాన్ని తెలంగాణ సమాజం కళ్లారా చూడబోతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.