ETV Bharat / politics

అభ్యర్థుల ఎంపికపై జగన్​ మల్లగుల్లాలు- సీటు ఖాయమనుకున్న వారికి షాక్ - వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితా

CM Jagan's changes in YSRCP candidates : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో చిరంజీవిని మార్చిన అధిష్ఠానం తాజాగా లావణ్యను నియమించింది. మంగళగిరితో పాటు మరో అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిలను నియమిస్తూ తొమ్మిదో జాబితా ప్రకటించింది.

ysrcp_candidates_change
ysrcp_candidates_change
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 6:46 AM IST

Updated : Mar 2, 2024, 10:21 AM IST

అభ్యర్థుల ఎంపికపై జగన్​ మల్లగుల్లాలు- సీటు ఖాయమనుకున్న వారికి షాక్

CM Jagan's changes in YSRCP candidates : అభ్యర్థుల మార్పులు అయిపోయాయని గతనెల 27న ప్రకటించిన జగన్ ఆ మర్నాడు 8వ జాబితాలో, తాజాగా శుక్రవారం విడుదల చేసిన 9వ జాబితాలోనూ మార్పులు కొనసాగించారు. 9వ జాబితాలో నెల్లూరు లోక్‌సభకు విజయసాయిరెడ్డి, కర్నూలు అసెంబ్లీ స్థానానికి విశ్రాంత IAS అధికారి ఇంతియాజ్‌ని, మంగళగిరికి మురుగుడు లావణ్య పేర్లు ప్రకటించింది.

రసవత్తరంగా ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం - అధిష్ఠానం ఎత్తులకు ఆశావహుల ప్రతివ్యూహం

రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని ఇప్పుడు నెల్లూరు లోక్‌సభ(Nellore Lok Sabha) సమన్వయకర్తగా నియమించారు. అక్కడ అప్పటికే ప్రకటించిన మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. దీంతో నెల్లూరుకు అభ్యర్థి కోసం పలువురి పేర్లను పరిశీలించి చివరికి సాయిరెడ్డిని ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి 2022 జూన్‌లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనకు 2028 జూన్ వరకు అంటే మరో నాలుగేళ్లు పదవీకాలం ఉంది. ఇంతలోనే నెల్లూరు లోక్‌సభ బరిలో దింపుతున్నారు.

ఇన్చార్జీల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు - సీఎంఓ చుట్టూ నేతల ప్రదక్షిణ

నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించిన వేమిరెడ్డి పార్టీ వదిలి వెళ్లిపోయారు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్డి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిపై అనర్హత వేటూ వేడింది. నెల్లూరు లోక్‌సభ పరిధిలోకొచ్చే కందుకూరులో ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహీదర్‌రెడ్డిని తప్పించి కొత్త అభ్యర్థిని తీసుకువచ్చారు. ఇక మహీదర్‌రెడ్డి పార్టీలో ఉంటారా లేదా అనేది అనుమానమే. 2019లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ ఇప్పుడు జిల్లాలో సీనియర్లు లేక, ఉన్నవారు సరిపోతారో లేదో అర్థంకాక ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది.

జగన్ పిలుపుతో నేతల గుండెల్లో పిడుగు - ఈ సారి కరివేపాకులు ఎవరో?

మంగళగిరిలో మురుగుడు లావణ్యను సమన్వయకర్తగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం వరకూ గంజి చిరంజీవి సమన్వయకర్తగా కొనసాగారు. డిసెంబరు 1న సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి చిరంజీవిని సమస్వయకర్తగా నియమించారు. ఆ రోజునే ఆర్కే పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. ఓవైపు ఆర్కే వర్గం, మరోవైపు మాజీ MLA కాండ్రు కమల, MLC మురుగుడు హనుమంతరావు వర్గాలతో చిరంజీవి(Chiranjeevi) పోరాడాల్సి వచ్చింది. 2014లో చిరంజీవి టీడీపీ అభ్యర్థిగా ఆర్కేపై పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆయన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో తన ప్రత్యర్థిని తీసుకువచ్చి తనను పక్కన పెట్టారని కినుక వహించిన ఆర్కే డిసెంబరులో రాజీనామా చేశారు. తర్వాత వైకాపా పెద్దలు ఆయనతో సంప్రదింపులు జరిపి మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చారు. అయితే చిరంజీవి కాకుండా మరో బీసీ అభ్యర్థిని మంగళగిరిలో నిలబెడితేనే తాను మద్దతిస్తానని పార్టీలోకి తిరిగి వచ్చేటప్పుడు ఆర్కే షరతు పెట్టినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్యను నియమించారంటున్నారు. హనుమంతరావు కుటుంబసభ్యులు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, తదితరులందరినీ వెంటబెట్టు కుని ఆర్కే శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఆ తర్వాతే లావణ్య పేరును ప్రకటించారు.

ఐఏఎస్ అధికారిగా ఉన్న ఇంతియాజ్ ఫిబ్రవరి 28న ఉదయం తన పదవికి స్వచ్ఛంద విరమణ చేస్తూ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సాయంత్రానికి ప్రభుత్వం నుంచి అనుమతిస్తూ జీవో వచ్చేసింది. గురువారం ఆయన వెళ్లి ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిపోయారు. శుక్రవారం ఆయన పేరును కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించేశారు.

ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ కసరత్తు - త్వరలోనే మారిన అభ్యర్థుల జాబితా

Last Updated : Mar 2, 2024, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.