ETV Bharat / politics

మీ ఆటలు సాగవు - భూకబ్జాలకు పాల్పడితే కఠినశిక్ష: సీఎం చంద్రబాబు - CM CHANDRABABU ON HIGH COURT BENCH

ఎడ్యుకేషన్‌ హబ్‌గా రాయలసీమ - అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు వెల్లడి

cm_chandrababu_on_high_court_bench
cm_chandrababu_on_high_court_bench (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2024, 5:25 PM IST

Updated : Nov 21, 2024, 10:23 PM IST

CM Chandrababu in Assembly : కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు అవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. లోకాయుక్త, ఏపీ హెచ్‌ఆర్సీ తదితర సంస్థలు కూడా అక్కడే ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలని సీఎం ఆకాంక్షించారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం అన్నారు.

తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి లాంటి ప్రాజెక్టులను అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. నదుల అనుసంధానంతో అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. సీమకు తాగు, సాగునీటి సమస్య లేకుండా చేస్తామని ఎయిర్‌పోర్ట్స్, విద్య, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్ క్లస్టర్ల కోసం 5వేల కోట్లు కేటాయించినట్లు సీఎం స్పష్టం చేశారు.

ఆడబిడ్డల జోలికొస్తే వదిలే ప్రసక్తే లేదు: ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా వైస్సార్​సీపీ నేతలు పోస్టులు పెట్టిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని కానీ అందులో వైఎస్సార్​సీపీ కార్యకర్తలనే ఉద్యోగులుగా నియమించారని తెలిపారు. డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల చేత అసభ్యంగా పోస్టులు పెట్టించారని ఇక భవిష్యత్‌లో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని హెచ్చరించారు. ఆడబిడ్డల కోసం దేశమంతా అధ్యయనం చేసి చట్టాలు చేశామని నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగించేలా లా అండ్‌ ఆర్డర్‌ ఉంటుందని తెలిపారు.

ప్రతి జిల్లాలో సైబర్‌ పోలీస్‌స్టేషన్‌: రాష్ట్రంలో పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పోలీసులు వేరేవాళ్లపై ఆధారపడకుండా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. 2,812 కొత్త పోలీసు వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామని కాని గత ప్రభుత్వం పోలీసులకు బకాయిలు పెట్టిందని తెలిపారు. వీలైనంత త్వరలో వాటిని చెల్లిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో సైబర్‌ పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం అన్నారు.

అవిశ్వాస తీర్మానాలపై గడువు రెండేళ్లకి కుదింపు - క్యాబినెట్ సంచలన నిర్ణయాలు

వర్రాని జగన్ వెనుకేసుకొస్తున్నారు: తల్లిని, చెల్లిని దూషించినా జగన్ పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. షర్మిలపై వర్రా రవీందర్‌రెడ్డి పెట్టిన పోస్టులు నోటితో చెప్పలేని విధంగా ఉన్నాయని తెలిపారు. వర్రా రవీందర్‌రెడ్డి పేరుతో వేరేవాళ్లు పోస్టులు పెట్టారని జగన్‌ అంటున్నారని అన్నారు. ఇన్ని చేసినా వర్రాను జగన్ ఇంకా వెనుకేసుకొస్తున్నారని అన్నారు. అవినాష్‌రెడ్డిపై కూడా కేసు పెట్టాలని షర్మిల చెబుతున్నారని అన్నాకు. పవన్ కల్యాణ్, అనితపై కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే: గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు రాష్ట్రంలోనే ఉండేవని సీఎం అన్నారు. గతంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని అన్నారు. గత ప్రభుత్వం గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడం వల్ల రాష్ట్రంలో ఏన్నో నేరాలు జరిగాయని అన్నారు. నాసిరకం మద్యం అమ్మడం వల్ల గంజాయికి అలవాటుపడ్డారని విద్యాసంస్థల్లోకి కూడా గంజాయి, డ్రగ్స్‌ చేరాయని తెలిపారు.

భూమిని ఆక్రమిస్తే కఠిన శిక్ష: ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ గత ప్రభుత్వం తెచ్చిందని సీఎం అన్నారు. సివిల్‌ జడ్జి అధికారాలన్నీ రెవెన్యూ ఉద్యోగులకు ఇచ్చారని తెలిపారు. ఇకనుంచి భూమిని ఆక్రమిస్తే శిక్షతో పాటు భూమి కూడా ఉండదని హెచ్చరించారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వస్తాయని అందువల్ల పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్లను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇష్టానుసారం చేయాలనుకుంటే మీ ఆటలు సాగవని అన్నారు.

పీఏసీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ - అసెంబ్లీకి చేరుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా టార్గెట్ : లోకేశ్‌

Last Updated : Nov 21, 2024, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.