CM Chandrababu Comments on Bandar Port Works: డిసెంబరు 2025 నాటికి బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పోర్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలను ఆహ్వానిస్తామని తెలిపారు. బందరు కళాశాలకు పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి తదితరులు సీఎం పర్యటనలో ఉన్నారు.
బందరు పోర్టు విధానాన్ని మార్చడం నాకిష్టం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. పీపీపీ మోడల్‌లో బందరు పోర్టు పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2025 అక్టోబరు నాటికి పోర్టు పనులు పూర్తి చేయాల్సి ఉంది కాని పోర్టులో ఇప్పటివరకు రూ.885 కోట్ల పనులే జరిగాయని వివరించారు. గడువులోగా పోర్టు పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తానని సీఎం తెలిపారు. గడువులోగా పనులు పూర్తి కాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాజెక్టుకు ఇంకా 36.3 ఎకరాలు ఇవ్వాలని కలెక్టర్‌కు చెప్పినట్లు తెలిపారు. పోర్టు పూర్తయితే మచిలీపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ - చెత్త పన్ను ఎత్తేసిన చంద్రన్న సర్కార్ - Abolition Garbage Tax in AP
అమరావతికి దగ్గరగా ఉండే బందరు పోర్టును రాజధాని పోర్టుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పనులకు ఇసుక కొరత ఉందన్న ఫాస్ట్‌ట్రాక్‌లో ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. పరిశ్రమలు వస్తే బందరు నుంచి ఎగుమతులు పెరుగుతాయని తెలిపారు. బందరు పోర్టు కోసం ఎందరో ఉద్యమాలు చేశారని అలాంటి పోర్టును పూర్తి చేసి చూపిస్తామని సీఎం అన్నారు. పోర్టులో 4 బెర్తులున్నాయని వాటిని పెంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బందరు పోర్టుకు అవసరమైతే మళ్లీ భూసమీకరణ చేస్తామని వివరించారు. పోర్టు, రైల్వే లేన్, హైవేతో మచిలీపట్నం రూపురేఖలు మారతాయని అంతే కాకుండా ఆంధ్రా జాతీయ కళాశాలను తీసుకుని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
పోర్ట్ ఫైనల్ ప్రాజెక్టు 3696 ఎకరాలు అవసరమవుతాయి. ఇది పూర్తి అయితే మచిలీపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలకు కూడా ఇక్కడ అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయి. ఈ అవకాశాలను పరిశీలీంచి వాటిని ప్రోత్సహిస్తాం. మంచి పోర్ట్‌గా బందరును అభివృద్ధి చేసి చూపుతాం. ప్రభుత్వ ఆస్తులను గత ప్రభుత్వం దోచుకుంది, వాటిపై విచారణ చేసి స్వాధీనం చేసుకుంటాం.- చంద్రబాబు, సీఎం