ETV Bharat / politics

ఏడాదిలోగా గన్నవరం ఎయిర్‌పోర్ట్​ కొత్త టెర్మినల్​ ప్రారంభం: కేంద్రమంత్రి రామ్మోహన్‌ - Rammohan on Vijayawada Airport

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 3:05 PM IST

Rammohan on Gannavaram Airport Development : విజయవాడ విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేకదృష్టి పెట్టామని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. దేశం మొత్తం ఆంధ్ర వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Rammohan Naidu on Vijayawada Airport
Rammohan Naidu on Vijayawada Airport (ETV Bharat)

Rammohan on Vijayawada Airport : దేశంలో విమానయాన రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోదీ హయంలో పదేళ్లలో 57 విమానాశ్రయాలు నిర్మించారని గుర్తు చేశారు. భవిష్యత్​లో నూతనంగా 200 కొత్త ఎయిర్‌పోర్ట్​లను నిర్మించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. విజయవాడలో గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా : ఈ క్రమంలోనే గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని, విజయవాడ-దిల్లీ ఇండిగో సర్వీసును రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు గన్నవరం ఎయిర్​పోర్ట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని రామ్మోహన్​ నాయుడు తెలిపారు. గత ఆగస్టులో ఈ విమానశ్రయం నుంచి 85,000ల మంది ప్రయాణించారని చెప్పారు. ప్రస్తుతం ఈ సంఖ్య లక్షకు పెరిగిందని పేర్కొన్నారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామని ఆయన వివరించారు.

ఇందులో భాగంగానే 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేసుకున్నామని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పుణెకు కొత్త సర్వీసు, అక్టోబర్‌ 27న విశాఖ- దిల్లీకి సర్వీసును ప్రారంభించనున్నట్లు చెప్పారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. వీటిని దుబాయ్‌, సింగపూర్‌కు విస్తరించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఏడాదిలోగా గన్నవరం ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్‌ ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, మైసూరు ఎంపీ యధువీర్‌, తదితరులు పాల్గొన్నారు.

"రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, పర్యటకాభివృద్ధికి మా శాఖ తరుపున కృషి చేస్తాం.విజయవాడ విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దేశం మొత్తం ఆంధ్రావైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నాం. కొత్తగా ముంబయికి 2, బెంగుళూరుకు 1, దిల్లీకి 1 సర్వీసు చొప్పున ప్రారంభించాం. భవిష్యత్​లో సింగపూర్, దుబాయ్‌లకు కూడా సర్వీసులు విస్తరించనున్నాం." - రామ్మోహన్‌ నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి

ఏడాదిలోగా విజయవాడ అంతర్జాతీయ టర్మినల్‌ నిర్మాణం పూర్తి: కేంద్ర మంత్రి రామ్మోహన్​ - Vijayawada airport

విశాఖ విమానాశ్రయంలో డిజియాత్ర సేవలు- ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్​నాయుడు - Digiyatra starts at visakha Airport

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.