ETV Bharat / politics

వైసీపీ అవినీతి కోటను బద్దలు కొడుతున్నాం - బాదుడు లేని ప్రభుత్వాన్ని ఇస్తాం: చంద్రబాబు, పవన్​ - chandrababu pawan kalyan prajagalam - CHANDRABABU PAWAN KALYAN PRAJAGALAM

Chandrababu Pawan Kalyan Praja Galam: ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌ అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ విమర్శించారు. ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయకుండా జనం జీవితాలతో ఆటలాడారని మండిపడ్డారు. సహజవనరులను దోపిడీ చేస్తూ సంపద పోగేసుకుంటున్న వైసీపీ నేతలు పేదలకు సంక్షేమం ఇస్తున్నామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆక్షేపించారు. జగన్‌ కక్ష రాజకీయాలకు ఎంతో మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్న లక్ష్యంతోనే కూటమిగా వచ్చామన్న చంద్రబాబు అభివృద్ధి, ప్రగతికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

chandrababu_pawan_kalyan
chandrababu_pawan_kalyan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 7:01 AM IST

బాదుడు లేని ప్రభుత్వాన్ని ఇస్తాం - వైసీపీ అవినీతి కోటను బద్దలు కొడుతున్నాం - పవన్, చంద్రబాబు

Chandrababu Pawan Kalyan Praja Galam: ప్రజాగళం సభల్లో భాగంగా విజయనగరం, నెల్లిమర్లలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లుగా జగన్‌ ఉత్తరాంధ్ర ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక్క సాగు నీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు.

జగన్‌ను తరిమికొట్టాలి: కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తారకరామతీర్థ సాగర్‌ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయాన్ని 2025 కల్లా పూర్తి చేస్తామన్నారు. నెల్లిమర్ల అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా తయారవుతుందన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో నాటకం ఆడటం జగన్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేకుండా చేసిన జగన్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

చిరంజీవిలాంటి సినీ నటులనూ వదల్లేదు: ఉద్యోగులు, పోలీసులనూ జగన్‌ వంచించారని చంద్రబాబు ఆక్షేపించారు. కూటమి వస్తేనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. జగన్ కక్ష రాజకీయాలకు ఎంతో మంది బలయ్యారన్న చంద్రబాబు తల్లినీ చెల్లినీ సైతం వేధించారని మండిపడ్డారు. చిరంజీవిలాంటి సినీ నటులనూ వదల్లేదన్నారు.

జగన్‌ ఉత్తరాంధ్ర ద్రోహి - ఈ సారి డిపాజిట్లు కూడా రావు: చంద్రబాబు - Chandrababu Speech

జగన్ సభలకు రావాలంటే రూ.500 నోటు, క్వార్టర్ బాటిల్ ఇస్తున్నా జనం రాని పరిస్థితి ఉందని చంద్రబాబు ఆరోపించారు. తాను సీఎంగా ఉంటే ఈపాటికే ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్ పోర్టు వచ్చేదని, కానీ వైసీపీ పాలన కారణంగా ఇప్పటికీ రాలేదని విమర్శించారు. 2 వేల 750 ఎకరాలతో భూసమీకరణ చేసి శంకుస్థాపన చేస్తే జగన్ వచ్చాక దానికి మరోసారి శంకుస్థాపన చేస్తాడు గానీ పని మాత్రం పూర్తి చేయరని ఎద్దేవా చేశారు.

జగన్​కు, పవన్ కల్యాణ్​కు చాలా తేడా ఉంది: జగన్ అహంకారంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్న చంద్రబాబు, ప్రతి ఒక్కరూ ఆయన కింద బానిసలుగా బతకాలా అంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కల్యాణ్​ అని అన్నారు. ఆయన సినిమాలు తీసుకుంటే విలాసవంతంగా ఉండేవారని, కానీ ప్రజల కోసం ముందుకు వచ్చారని తెలిపారు. జగన్​కు, పవన్ కల్యాణ్​కు చాలా తేడా ఉందని పేర్కొన్నారు.

సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తాం: చంద్రబాబు - Chandrababu interacts with women

వైసీపీ అవినీతి కోటను బద్దలు కొడుతున్నాం: రాష్ట్రాన్ని గంజాయి మయం చేసిన జగన్‌కు ఓట్లతో బుద్ధి చెప్పాలని విజయనగరంలో పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా కూటమికే ఉందన్నారు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. యువత మార్పు కావాలని కోరుకుంటుందన్న పవన్‌ కల్యాణ్, ప్రజలకు సేవా నాయకత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అన్నింటిలో రాష్ట్రం వెనుకంజలో ఉందని, గంజాయిలో మాత్రమే రాష్ట్రం నంబర్‌ 1గా ఉందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అవినీతి కోటను బద్దలు కొడుతున్నామని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీ ఎక్కువైందని, కూటమి అభ్యర్థులు ఆరోపించారు. ప్రగతికి కోసం పనిచేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు. అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు వారు హామీ ఇచ్చారు.

జగన్​ అహంకారి - విధ్వంసం, వినాశనమే తప్ప అభివృద్ధి చేతకాదు : చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

Chandrababu Pawan Schedule: ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో సంయుక్తంగా పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు రైల్వేకోడూరులో బహిరంగ సభలో పాల్గొంటారు.

రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం - ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలి: చంద్రబాబు - Chandrababu Instructions

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.