Chandrababu Open Challenge To CM Jagan: ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చిందని, వైసీపీ బెండు తీయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్‌ను పులివెందుల ప్రజలు కూడా జగన్‌ను నమ్మేది లేదంటున్నారు. రైతును రాజు చేయడం తెలుగుదేశం సంకల్పమని, టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్‌కు సీమ అంటే హింస, హత్యా రాజకీయాలని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఈ ఐదేళ్లలో రాయలసీమకు చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు, పుట్టపర్తి సర్కిల్‌లో నిర్వహించిన చంద్రబాబు రోడ్ షో సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు.
శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు జరగాలని, కడప స్టీల్‌ప్లాంట్ వచ్చి ఉంటే వేలమందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమకు కియా మోటార్స్ తీసుకొచ్చామని, కరవుసీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయని చంద్రబాబు తెలిపారు. నా బ్రాండ్ కియా మోటార్స్ తేవడం, జగన్ బ్రాండ్ వేసిన స్టీల్‌ప్లాంట్‌కు మళ్లీ శంకుస్థాపన చేయడమని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పరిశ్రమలు తేకపోగా, ఉన్నవాటిని తరిమేశారని దుయ్యబట్టారు.
కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేది తన కల అని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం పూర్తిచేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకు వస్తామని తెలిపారు. ఆ సంకల్పంతోనే పోలవరం 72 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. హంద్రీనీవా నుంచి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు జగన్ అని చంద్రబాబు విమర్శించారు. ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలనేదే మా ఆలోచనని, నీటి ప్రాజెక్టుల కోసం రాయలసీమలో రూ.12 వేల కోట్లు ఖర్చుపెట్టామని, ఐదేళ్లలో ప్రాజెక్టులకు జగన్ పెట్టింది రూ.2 వేల కోట్లు మాత్రమే అని తెలిపారు. జగన్‌కు, నీటి విలువ, ప్రాజెక్టుల గురించి తెలుసా? అంటూ ప్రశ్నించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
చిన్నాన్నను చంపిన వ్యక్తిని ఎంపీగా నిలబెడతావా? అంటూ సీఎం జగన్‌కు చంద్రబాబు ప్రశ్నలు సందించారు. నిందితుడిని కాపాడుకోవడానికి బాధితులపైనే కేసులు పెట్టించారని విమర్శించారు. సీబీఐ అధికారులపైనే కేసు పెట్టించి బెదిరించారని ఆరోపించారు. దుర్మార్గులకు ఓటేస్తే ఎవరికైనా రక్షణ ఉంటుందా? అని ప్రశ్నించారు. మనుషులను చంపేసి వేరేవారిపై కేసు పెట్టిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్విట్ జగన్, సేవ్ రాయలసీమ నినాదం తీసుకోవాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం అసన్నమైందన్నారు.
ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చింది. వైసీపీ బెండు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. చిన్నాన్నను చంపిన వ్యక్తిని ఎంపీగా నిలబెడతావా? నిందితుడిని కాపాడుకోవడానికి బాధితులపైనే కేసులు పెట్టించారు. సీబీఐ అధికారులపైనే కేసు పెట్టించి బెదిరించారు. దుర్మార్గులకు ఓటేస్తే ఎవరికైనా రక్షణ ఉంటుందా? మనుషులను చంపేసి వేరేవారిపై కేసు పెట్టిస్తారా? క్విట్ జగన్, సేవ్ రాయలసీమ నినాదం తీసుకోవాలి. జగన్ అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం అసన్నమైంది. -చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధినేత
LIVE: బనగానపల్లి 'ప్రజాగళం' సభలో చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Praja Galam Live
నాయుడుపేట బహిరంగ సభ: మందుబాబుల బలహీనత జగన్‌కు బాగా అర్థమైందని, అందుకే మద్యం ధరలు బాగా పెంచి పేదలను దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నాణ్యమైన మద్యం తెస్తానని నాయుడు పేటలో నిర్వహించిన ప్రజాగళం భహిరంగ సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
టీడీపీ వచ్చాక మద్యం రేట్లు తగ్గిస్తాం. ఉచిత ఇసుక అనేది పెద్ద కుంభకోణం. ఇసుక పాలసీతో పనిలేక లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ఆఖరికి మట్టి, గ్రావెల్ కూడా దోచుకుంటున్నారు. పేదలకు రెండు సెంట్లలో ఇళ్లు కట్టిస్తాం. ఇప్పుడు కట్టే కాలనీలు రద్దు చేయను.. అక్కడే ఇళ్లు కట్టిస్తాను -నాయుడుపేడ ప్రజాగళంలో చంద్రబాబు
శ్రీకాళహస్తిలో చంద్రబాబు బహిరంగ సభ : జగన్ విధ్వంస పాలనతో దగా పడి రివర్స్ గేర్‌లో వెనక్కి వెళ్లిన ఏపీని తిరిగి గాడిలో పెట్టడమే తన ఏకైక ఎజెండా అని చంద్రబాబు చెప్పారు. నాయుడుపేట సభ తర్వాత శ్రీకాళహస్తిలో నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు జగన్ అనేక కుటిలయత్నాలు పన్నుతున్నారన్న బాబు వాటిని ప్రజలు సైతం ఛీకొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజలు జగన్ బెండ్ తీయడం ఖాయమైందని చంద్రబాబు అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 8 డీఎస్సీలు పెట్టా ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ వేయలేని పాలన జగన్‌ది అని విమర్శించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పదవి ఉంటే ఒదిగి పనిచేసిన వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని గుర్తు చేశారు.