ETV Bharat / politics

రెండు సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టి ఇస్తాం- ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఖాతాల్లో వేస్తాం: చంద్రబాబు - Chandrababu Election Campaign - CHANDRABABU ELECTION CAMPAIGN

Chandrababu Election Campaign: విశాఖపట్నంను ఐటీ కేంద్రంగా చేయాలని చూస్తే సీఎం జగన్ వచ్చి గంజాయి కేంద్రంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. పేదోడినని చెప్పుకొనే ఈ ముఖ్యమంత్రి తొమ్మిది సార్లు విద్యుత్‌ ఛార్జీలు, 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు.

Chandrababu Election Campaign
Chandrababu Election Campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 8:02 PM IST

Updated : Apr 15, 2024, 9:15 AM IST

ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితం- ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో వేస్తాం: చంద్రాబాబు

Chandrababu Election Campaign : విశాఖపట్నంను ఐటీ కేంద్రంగా చేయాలని చూస్తే సీఎం జగన్ వచ్చి గంజాయి కేంద్రంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు.

పేదోడికి వరాలు : పేదోడినని చెప్పుకొనే ఈ ముఖ్యమంత్రి తొమ్మిది సార్లు విద్యుత్‌ ఛార్జీలు, 3 సార్లు బస్సు ఛార్జీలు పెంచారని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్‌ తెచ్చిన ప్రతి పథకం వెనుక పెద్ద కుంభకోణం ఉందని, కుంభకోణాలకు పాల్పడిన వారిని ఉక్కు పాదంతో తొక్కాలని పిలుపునిచ్చారు. ఆకాశమే హద్దుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే మేనిఫెస్టో తెచ్చామని అన్నారు. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో వేస్తామని, తల్లికి వందనం కార్యక్రమం కింద ఏడాదికి రూ.15వేల చొప్పున, ఏప్రిల్‌ నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.4వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

జూన్‌ 4న అమరావతి రక్షణ - జగనాసుర వధ : చంద్రబాబు - Chandrababu Election Campaign

27 పథకాలు రద్దు : విశాఖలో మాస్క్‌ అడిగిన పాపానికి ఎస్సీ డాక్టర్‌ సుధాకర్‌ను అవమానించి, హింసించి ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మ శాంతించాలంటే వైఎస్సార్సీపీను ఓడించాలని, సీఎం జగన్‌ దళిత ద్రోహి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వైసీపీను భూ స్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ ఆశయం, తన అనుభవం, పవన్‌ కల్యాణ్‌ శక్తి కూడదీసుకుని ఈ రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత మీది, యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనది భరోసా ఇచ్చారు. రుషి కొండను అనకొండలా మింగేశారు.

జగన్ చేసేవి శవ రాజకీయాలు - నావి ప్రజా రాజకీయాలు: చంద్రబాబు - Bapatla Prajagalam Sabha

జగన్‌ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయను : ఐదేళ్లలో ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేశారని చంద్రబాబు అన్నారు. ప్రశాంతమైన ఈ ప్రాంతాన్ని నేరస్థులకు అడ్డాగా మార్చేశారని, ఉత్తరాంధ్రలో రూ.40వేల కోట్లు దోచేసిన దుర్మార్గుడు ఈ సీఎం అని, రుషికొండను అనకొండలా మింగేశారని ఆరోపించారు. రూ.500కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్‌ కట్టుకున్నాడని, పేద వారి ఇళ్ల నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదని తెలిపారు. జగన్‌ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయనని తెలిపారు. రాని వారికి 2సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. దేశంలో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తామని మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. అందులో రాష్ట్రానికి దాదాపు 30 లక్షల ఇళ్లు వస్తాయని అన్నారు. తాను వస్తే పరిశ్రమలు వస్తాయని, జగన్‌ వస్తే గంజాయి వస్తుందని ఎద్దేవా చేశారు. విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్‌ చేసినా దిక్కులేదని అన్నారు.

వైసీపీలోని మంచివాళ్లు టీడీపీలోకి రావాలి- ఐదేళ్లలో జగన్‌ ఎవరినైనా కలిశారా?: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING

Last Updated : Apr 15, 2024, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.